తార్ మార్‌.. త‌క్కెడ మార్‌… ఎండ్ టైటిల్స్‌లోనే..!

చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్… ఇద్ద‌రూ సూప‌ర్ స్టార్లు. ఒక‌రు బాలీవుడ్ ని ఏలితే… ఇంకొక‌రు టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్. ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పెస్తే…? ఆ మ‌జానే వేరు. `గాడ్ ఫాద‌ర్‌`ఆ అవ‌కాశం కల్పించింది. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన గాడ్ ఫాద‌ర్ లో స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరు,స‌ల్మాన్‌ల‌పై `తార్ మార్ త‌క్కెడ‌మార్‌` అనే పాట రూపొందించారు.ముంబైలో ప్ర‌భుదేవా డైరెక్ష‌న్ లో ఈ పాట‌ని చిత్రీక‌రించారు. బుధ‌వారం పాట కూడా విడుద‌లైంది. ఈ పాట‌ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆశ ప‌డుతున్నారు.

అయితే ఈ పాట సినిమాలో ఉండ‌దు. కేవ‌లం ఎండ్ టైటిల్స్ కోసం మాత్ర‌మే రూపొందించారు. సినిమాలో.. ఎక్క‌డా సంద‌ర్భం కుద‌ర‌క‌పోవ‌డంతో చివ‌ర్లో ప్లే చేయాల్సివ‌స్తోంద‌ట‌. ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల పాట ఎండ్ టైటిల్స్ లో పెట్ట‌డం నిజంగానే.. నిరుత్సాహ ప‌రిచే విష‌యం. ఈమ‌ధ్య లైగ‌ర్‌లో కూడా ఇదే జ‌రిగింది. ఓ మంచి పాట‌కు స‌రైన ప్లేస్ మెంట్ ఇవ్వ‌లేక‌.. ఎండ్ టైటిల్స్ లో ఇరికించేశారు. అప్ప‌టికే ఆ సినిమా రిజ‌ల్ట్ తేలిపోవ‌డంతో ఆ పాట‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. సినిమా బాగుంటే ఎండ్ టైటిల్స్ ని కూడా జ‌నాలు ఎంజాయ్ చేస్తారు. తేడా కొడితే మాత్రం చిరు,స‌ల్మాన్‌లు కాదు క‌దా, దేశంలోని సూప‌ర్ స్టార్లంతా క‌లిసి స్టెప్పులేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. చిరు,స‌ల్మాన్ లాంటి ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు క‌లిసి చిందేయ‌డం అరుదైన సీనే. దానికి సినిమాలో ప్లేస్ మెంట్ దొర‌క్క‌పోవడం మాత్రం బ్యాడ్ ల‌క్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close