ఇద్ద‌రూ హిట్ కొట్టాల్సిందే!

ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న సినిమాల్లో నాగ‌శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’, శ్రీ‌విష్ణు ‘అల్లూరి’ల‌పై ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంది. రెండు సినిమాలూ బాగానే ప‌బ్లిసిటీ చేసుకొన్నాయి. రెండు సినిమాల ట్రైల‌ర్లూ.. ఆక‌ర్షిస్తున్నాయి. ఇద్ద‌రూ మీడియం రేంజు హీరోలే. ఇద్ద‌రికీ ఇప్పుడు హిట్టు కొట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఛ‌లో త‌ర‌ర‌వాత శౌర్య‌కు ఆ రేంజ్ హిట్టు ప‌డ‌లేదు. తాను క‌ష్ట‌పడి, ఇష్ట‌ప‌డి చేసిన ‘అశ్వ‌ద్ధామ’, ‘ల‌క్ష్య‌’ చిత్రాలు దారుణంగా బెడ‌సి కొట్టాయి. పైగా ఇది శౌర్య సొంత బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా. త‌న‌కు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ ని ఎంచుకొన్నాడు. యూత్‌కి న‌చ్చితే.. శౌర్య‌కు హిట్ న‌ల్లేరుపై న‌డ‌కే.

ఓ హిట్టూ, మూడు ఫ్లాపులూ అన్న‌ట్టు సాగుతోంది శ్రీ‌విష్ణు కెరీర్‌. ‘బ్రోచేవారెవ‌రురా’ త‌ర‌వాత వ‌రుస‌గా అన్నీ ఫ్లాపులే. `రాజ రాజ చోర‌` మ‌ళ్లీ ఊపిరి పోసింది. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `భ‌ళా తంద‌నాన‌` డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు `అల్లూరి`పై భారీగా ఆశ‌లు పెట్టుకొన్నాడు. త‌న కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్ర పోషించిన చిత్ర‌మిది. ఈ క‌థ త‌న కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌పై కూడా ఇదివ‌ర‌కెప్పుడూ లేనంత శ్ర‌ద్ధ పెట్టాడు శ్రీ‌విష్ణు, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి అల్లు అర్జున్ ని తీసుకొచ్చి, హైప్ పెంచే ప్ర‌య‌త్నం చేశాడు. పోలీస్ క‌థ‌లు స‌క్సెస్‌ఫుల్ ఫార్ములానే. కాక‌పోతే. అందులోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలి. మ‌రి.. శ్రీ‌విష్ణు ఏం చేశాడో..? వీరిద్ద‌రూ ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న ఈ రెండు సినిమాల జాత‌కం మ‌రికొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా కేసులో సీబీఐ సైలెంట్ – పులివెందుల కోర్టు యాక్టివ్ !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై...

వైసీపీలోకి గంటా ! నిజమా ? బ్లాక్‌మెయిలింగా ?

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని హఠాత్తుగా ఆయన అనుచరులు మీడియాకు లీకులు ఇచ్చారు. డిసెంబర్ ఒకటో తేదీన గంటా శ్రీనివాస్ బర్త్ డే అని ఆ రోజున ప్రకటన...

ఢిల్లీలో కాదు.. తెలంగాణలోనే కేసీఆర్ సభలు !

వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్‌గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం...

హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా.... నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close