“UTK” లా భార‌త్‌లోకి అడుగుపెడుతున్న అమెరికా ‘గోదావ‌రి’

ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ద‌క్షిణ భార‌త రెస్టారెంట్ సంస్థ “గోదావ‌రి గ్రూప్‌“ ప్ర‌స్తుతం అమెరికా, కెన‌డాల్లో భార‌తీయుల‌కు ప‌సందైన వంట‌కాలు రుచి చూపిస్తోంది. అమెరికాలోని బోస్ట‌న్‌లో ఉన్న ఈ సంస్థ తాజాగా భార‌త్‌కు కూడా విస్త‌రించింది. గోదావ‌రి ప్ర‌వాహం మాదిరిగా.. త‌న శాఖ‌ల‌ను విస్త‌రిస్తోంది. United Telugu Kitchens (UTK) `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` UTK.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో త‌న తొలి సంస్థ‌ను ప్రారంభించింది. ఈ మేర‌కు `గోదావ‌రి గ్రూప్` ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈ రెస్టారెంట్ ద్వారా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లోని ప్ర‌సిద్ధ వంట‌కాల‌ను ఒకే గొడుగు కింద అందించ‌నున్నారు. నిపుణులైన చెఫ్‌ల‌తో ఆయా వంట‌కాల‌ను ఆహార‌ ప్రియుల‌కు అందించాల‌నే ఆలోచ‌న‌తో UTK విజ‌య‌వాడ‌ను ఎంచుకోవ‌డం విశేషం.

తెలంగాణ వంటకాల నుంచి దట్టమైన, సంక్లిష్టమైన మసాలాలతో నిండిన ఆంధ్ర, రాయలసీమ వంటకాల వరకు ఎంతో రుచిక‌ర‌మైన వంట‌ల‌ను విజయవాడలోని “UTK“లో అందుబాటులో తీసుకురానున్నారు.

“UTK” ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార ప్రియుల నోళ్ల‌ను ఊరిస్తోంది. ఇది ఆధునిక శైలితో కూడిన ప్రత్యేక  తెలుగు వంటకాలతో భారతీయ‌ సంస్కృతిని గొప్పగా చాటేలా ఆహార ప్రియుల‌ను ఆక‌ట్టుకోనుంది.

“UTK”  మొత్తం 8 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీనిలో `క‌లువ‌` పేరుతో చిన్న‌పాటి స‌మావేశ మందిరం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. గోదావరి చైన్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి భారతీయ వెర్షన్‌ను జోడించి.. ఆహార ప్రియుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేయ‌నుంది.

UTKను ఆకర్షణీయమైన వాతావరణంలో ఏర్పాటు చేయ‌డం వెనుక‌ వ్యవస్థాపకులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంటీరియర్ డెక‌రేష‌న్ లో ఆధునిక‌త‌, సంప్రదాయం వంటివాటిని మేళ‌వించి ఏర్పాటు చేయ‌డంతో ఇది ప్ర‌పంచ‌స్థాయి డిజైన్‌కు స‌రిస‌మానంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

రెస్టారెంట్  మస్కట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. 10 అడుగుల బుల్ ఫేస్ (గంగిరెద్దు) చెక్కబడింది, దీనిని తెలంగాణకు చెందిన ప్రసిద్ధ శిల్పి “రంగ‌” రూపొందించారు.

United Telugu Kitchens (UTK) యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)తో క‌లిసి ప‌నిచేసేందుకు కొత్త తరం మహిళా ఆహార వ్యాపారవేత్త తేజి పిన్నమమేని ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.  ఆహారంలో అభిరుచి, నైపుణ్యం తేజి సొంతం. తేజి భాగ‌స్వామ్యం వెను గోదావరి గ్రూప్ వ్యవస్థాపకులు కౌశిక్ కోగంటి, తేజా చేకూరిల కృషి ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌స్థాప‌కులు కౌశిక్ కోగంటి మాట్లాడుతూ.. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)ను దేశ‌వ్యాప్తంగా.. అన్నిరాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. తెలుగు వంట‌కాల రుచుల‌ను దేశం మొత్తానికి అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.

`మ‌న భాష‌, మ‌న భోజ‌నం` త‌ర‌హాలో స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి.. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఫుడ్ (Food) గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (CLICK HERE!!).

ఆసక్తి ఉన్న వారు టీమ్ లో చేరవచ్చు లేదా ఫ్రాంచైజీ పై ఆసక్తి ఉంటే hello@unitedtelugukitchens.com ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.

For Location Details:

United Telugu Kitchens (UTK)

Opp Mother Teresa Statue, Siddartha Nagar,

Vijayawada, AP, INDIA 520010.

ఈ వారాంతంలో “యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)”కు రండి…మా ప్రత్యేక వంటకాలు, రుచులను ఆస్వాదించండి…రండి అందరం కలిసి పండుగ చేసుకుందాం.

సదా మీ సేవ‌లో…..

https://unitedtelugukitchens.com/

Content Produced by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోస్ట‌ర్‌తోనే పోలిక‌లు మొద‌లా?

రాజ‌మౌళి సినిమాలు ఎంత గొప్ప విజ‌యాన్ని సాధిస్తాయో, రాజ‌మౌళికి, అత‌ని టీమ్ కీ ఎంత పేరు తీసుకొస్తాయో.. మిగిలిన వాళ్ల‌కు అంత ప‌రీక్ష‌గా మిగిలిపోతాయి. భారీ సినిమా ఏదొచ్చినా రాజ‌మౌళి సినిమాల‌తో పోలిక‌లు...

జగన్ కుటుంబంలో చిచ్చుకు సజ్జలే కారణమంటున్న టీఆర్ఎస్ !

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావుకు.. కేసీఆర్‌తో గొడవలు ఉన్నాయని సజ్జల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అసలు జగన్ కుటుంబం ఇలా చీలికలు పేలికలు అయిపోవడానికి...

వినతి పత్రాన్ని వీఆర్‌ఏల మీదే విసిరికొట్టిన కేసీఆర్ !

సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చింది. అది చిన్న కోపం కాదు. సీఎంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిరచిత్తంతో ఉండాల్సిన కేసీఆర్ ఒక్క సారిగా తన చేతిలో ఉన్న వినతి పత్రాన్ని విసిరికొట్టారు. అదీ...

సీబీఐ కేసులో స్టే తెచ్చుకున్న రఘురామ !

ఇండ్ భారత్ కంపెనీల ద్వారా బ్యాంకులకు పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వ్యవహారంలో తన కంపెనీలపై జరుగుతున్న విచారణపై రఘురామ ఊరట పొందారు. సుప్రీంకోర్టు సీబీఐ కేసు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close