ఫిల‌డెల్ఫియాలో ఈ వారాంతంలో అందుబాటులోకి రానున్న గోదావ‌రి

భార‌తీయ రుచులకు ప్ర‌పంచంలోనే టాప్‌ బ్రాండ్‌గా పేరొందిన గోదావ‌రి ఈ వారాంతంలో (శ‌నివారం) ఫిల‌డెల్పియాలో త‌న నూత‌న కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తోంది.

ఫిల‌డెల్ఫియాలోని ప్ర‌ధాన ప్రాంతాల్లో ఒక‌టైన మాల్‌వ‌ర్న్ (కింగ్ ఆఫ్ ప్ర‌స్యా ఏరియా)లో గోదావ‌రి కొలువుదీరింది. సాయిబాబా దేవాల‌యానికి కొద్ది అడుగుల దూరంలోనే ఉంది. భార‌తీయ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గిన రీతిలో మ‌రియు భార‌తీయ ప్రామాణిక రుచుల‌ ఆహారాన్ని ఆర‌గించాల‌నే వారికి చేరువ‌లో ఈ రెస్టారెంట్ కొలువుదీరి ఉంది (Indian restaurants in Philadelphia).

గోదావ‌రి ఫిల‌డెల్ఫియా (Godavari Philadelphia) త‌న‌దైన శైలిలో విశిష్ట‌ రుచుల‌తో బాంక్వెట్ హాల్ మ‌రియు సిగ్నేచ‌ర్ లంచ్ బ‌ఫెట్‌ను మ‌రియు నోరూరించే రుచుల‌ను ఈ వారాంతంలో అందించ‌నుంది. కొర‌మీను తందూరి, గోంగూర అన్నం, మామిడికాయ మాంసం, క్యార‌ట్ ఇడ్లీ, `రాణి`గారి దోశ‌, `తాగుబోతు` కోడి వేపుడు మ‌రియు గోదావ‌రి యొక్క విశిష్ట‌మైన “జ్యోతిల‌క్ష్మి” జున్ను సైతం అందించ‌నుంది.

“గోదావ‌రి” ప్ర‌త్యేక‌మైన బ్రాండ్‌గా అమెరికా మ‌రియు కెనడా స‌హా అనేక దేశాల్లో త‌న ఆతిథ్యాన్ని విస్త‌రిస్తూ…ఈ ఏడాది యూరోపియ‌న్ మార్కెట్‌లోకి త‌న సేవ‌ల‌ను చేరువ చేస్తోంది.

ఇటీవ‌లే త‌న సేవ‌లు అందుబాటులోకి తెచ్చ‌ని సిన్సినాటి, జెర్సీ సిటీల‌లోని కేంద్రాలు త‌మ ప్ర‌త్యేక‌మైన మ‌రియు విశిష్ట‌ వంట‌కాల‌తో ప్ర‌తిరోజూ పెద్ద ఎత్తున అతిథుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

“గోదావ‌రి డెలావేర్‌లో అనేక ఏళ్లుగా ఆహారాన్ని ఆర‌గిస్తున్న మేం `ఫిల‌డెల్ఫియా`లో గోదావ‌రి ప్రారంభోత్స‌వం ప‌ట్ల ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. కింగ్ ఆఫ్ ప్ర‌ష్యా ప్రాంతంలో ప్రామాణిక‌మైన భార‌తీయ ఆహారం లేని నేప‌థ్యంలో (Authentic Indian food in King of Prussia Area) …గోదావ‌రి రాక మాకెంతో సంతోష‌క‌రం. మేం గోదావ‌రికి ఆత్మీయ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నాం” అని ఈ ప్రాంతంలో ఏడు సంవ‌త్స‌రాల‌కు పైగా నివ‌సిస్తున్న భోజ‌న ప్రియుడు శ్రీ అర‌వింద్ రెడ్డి త‌న సంతోషాన్ని ఈ సంద‌ర్భంగా పంచుకున్నారు.

“అత్యున్న‌త‌మైన సేవ‌లు అందించ‌డం ద్వారా `గోదావ‌రి` బ్రాండ్ నేమ్ నిల‌బ‌డేలా మేం కృషి చేయ‌నున్నాం. గోదావ‌రి యొక్క అన్ని కేంద్రాల్లో డెలావేర్ అత్యుత్త‌త‌మైన కేంద్రంగా ఆద‌ర‌ణ పొందుతున్న నేప‌థ్యంలో,ఆ పేరును కాపాడేలా మేం కృషి చేయ‌నున్నాం“అని గోదావరి ఫిల‌డెల్ఫియాకు చెందిన అస్లాం & ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

గోదావ‌రిచే ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డిన విశిష్ట‌మైన విధాన‌మైన “బాహుబ‌లి థాళీ” (Bahubali Thali) అమెరికాలోని భోజ‌న ప్రియులు త‌ప్ప‌నిస‌రిగా రుచి చూడాల్సిన వంట‌కం. ప్ర‌తి ఒక్క‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉండ‌ట‌మే కాకుండా విభిన్న‌మైన వంట‌కాల‌తో భార‌తీయ వంట‌కాల రుచుల‌ను మ‌రో మెట్టుకు చేర్చేలా కృషి చేస్తున్న గోదావ‌రి బృందం ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ అభినందిస్తున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా గోదావ‌రి యొక్క కేంద్రాన్ని ప్రారంభించేందుకు… Franchise@godavarius.com కు మీరు ఈ మెయిల్ చేయ‌వ‌చ్చు.

ఈ వారాంతంలో గోదావ‌రి మాల్‌వ‌ర్న్ (ఫిల‌డెల్ఫియా)కు విచ్చేసి నోరూరించే ప్ర‌త్యేక‌మైన రుచుల‌ను ఆరంగించండి.

చిరునామా:

గోదావ‌రి ఫిల‌డెల్ఫియా
630 లాంక‌స్ట‌ర్ అవె
మాల్‌వ‌ర్న్, ఫిల‌డెల్ఫియా, 19355.

మ‌రింత స‌మాచారం కోసం దయ‌చేసి సంప్ర‌దించండి.

అస్లాం
224-360-2424
Philly@GodavariUS.com

సదామీసేవ‌లో…..

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com