డబ్బులు పంచుతానంటే రుణాలిస్తారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రపంచాన్ని కమ్మేస్తున్న ఆర్థిక మాంద్యం.. కొత్త ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల ఏపీకి ముందే వచ్చింది. ఇప్పుడు… జీతాలు, పెన్షన్ల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఆదాయం తగ్గిపోయింది. ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ల వంటి వద్ద… విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ఏపీకి .. న్యూ డెలవప్ మెంట్ బ్యాంక్ .. రూ. ఆరు వేల కోట్లు రుణం ఇవ్వడానికి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయింది. ఆ భేటీలో జగన్ … ఏపీకి రూ. 25వేల కోట్లు రుణం ఇవ్వాలని కోరారు.

జగన్ హామీలు నెరవేర్చాలంటే ఇప్పటికిప్పుడు రూ. 25 వేల కోట్లు కావాలి..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను.. ఈ నెల నుంచి అమలు చేయడం ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల చివరివారంలో సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ.10వేల ఆర్థికసాయం, అక్టోబరు 15న రైతు భరోసా పథకంతో రైతులకు రూ. 12,500 పంపిణీ చేయాల్సి ఉంది. ఇలా ప్రతీ నెలా… ఓ ఆరేడు వేల కోట్లు.. ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంది. జనవరి అమ్మ ఒడి కార్యక్రమం కింద తల్లులకు రూ. 15వేల పంపిణి చేయాల్సి ఉంది. ఎలా లేదన్న ఇప్పటికి.. ఇప్పుడు పథకాలను అమలు చేయడానికి రూ. 25వేల కోట్లు అప్పు కావాలి. ఇవి.. ప్రణాళికల్లో లేని అప్పులు.

జగన్‌కు ఆశాకిరణంగా బ్రిక్స్ బ్యాంక్..!

అప్పుల కోసం చూస్తున్న ఏపీ సర్కార్ కు.. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. మరికొన్ని సంస్థల నురచి కూడా ఆఫ్‌ బారోయిరగ్‌ రుణాలను తీసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను అభివృద్ధి చేసేరదుకు, ఇతర పథకాల అమలుకు ఆరు వేల కోట్ల రూపాయలు రుణం కావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డిబికి ప్రతిపాదించింది. ఇది కొద్ది రోజుల్లోనే బ్యాంకు బోర్డు ఆమోదం కోసం వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే తామిచ్చే రుణాలతో … తక్షణ ఉత్పాదక శక్తిని పెరపొరదిరచేరదుకు తీసుకురటున్న చర్యలు, పర్యావరణానికి ముప్పు లేకుండా తీసుకురటున్న చర్యలపై వివరాలు తెలుసుకునేందుకు నేరుగా వారు ఏపీకి వచ్చారు. వారికి ఏమి వివరాలను ఏపీ సర్కార్ ఇచ్చిందో కానీ.. మరో పాతిక వేల కోట్లు రుణంగా ఇవ్వాలని సీఎం నేరుగా కోరారు.

ఉత్పాదకత ఉంటేనే రుణాలిస్తాయి.. పంచడానికి ఇవ్వరు..!

ప్రపంచబ్యాంక్ అయినా… ఆసియా బ్యాంక్ అయినా.. బ్రిక్స్ బ్యాంక్ అయినా… రుణాలిస్తే… వాటిని ఎలా వాడుకుంటున్నారో చూస్తుంది. డబ్బు పంపిణీ పథకాలకు ఇస్తామంటే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఈ విషయం తెలియకుండానే.. ఏపీ సర్కార్… బ్యాంకుల వద్ద ప్రతిపాదనలు పెట్టేస్తోంది. రూ. ఆరు వేల కోట్లు ఇవ్వడానికి వచ్చిన బ్రిక్స్ బ్యాంక్ కు.. ఏపీ అధికారులు.. వాటిని ఏ ఏ .. అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తారో.. సంపూర్ణమైన నివేదిక ఇచ్చారో లేదో అన్న సందేహాలు ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు పథకాల అమలుకు రుణం కావాలి.. వాటి కోసం వినియోగిస్తామంటే… ఆ బ్యాంక్.. ప్రతిపాదనను తిరస్కరిస్తుంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : మళ్లీ టీడీపీ – బీజేపీ పొత్తు మాట..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీవారంతంలో తను రాసే ఆర్టికల్ " కొత్తపలుకు"లో ఇటీవల గాఢత తగ్గింది. ఏపీ సర్కార్‌పై... తెలంగాణ సర్కార్‌పై గతంలో ఆయన విరుచుకుపడే తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు...

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్...

రివ్యూ : రాంగోపాల్ వ‌ర్మ ‘ క్లైమాక్స్‌ ‘

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది. ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..? రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ... 'సినిమా...

జగన్ తో భేటీతో సినీ పరిశ్రమ సాధించేది ఏమీ లేదు: బాలకృష్ణ

జగన్ తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తో సినీ పరిశ్రమ భేటీ అయిన సందర్భంలో తనను పిలవలేదని బాలకృష్ణ అలగడం, భేటీకి హాజరైన పరిశ్రమ...

HOT NEWS

[X] Close
[X] Close