చంద్రమా.. అందుమా..! విక్రమ్ సిగ్నల్స్ కోసం ఉత్కంఠ…!

ఇస్రో శాస్త్రవేత్తల కృషి… చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో… నిలిచిపోయింది. చందమామను అందుకునే ప్రయత్నంలో… వేసిన ముందడుగు.. సక్సెస్ అయిందో.. లేదో .. తెలియకుండానే సమాచారం కట్ అయింది. చందమామ దాకా వెళ్లిన ల్యాండర్ విక్రమ్… అందుకున్నాడో లేదో సమాచారం… ఇస్రోకి చేరడం లేదు. ఆర్బిటార్‌ నుంచి వేరైన ల్యాండర్‌.. చంద్రుడి మీదికి చేరాల్సి ఉంంది. చంద్రుడి ఉపరితలంపై పరిభ్రమిస్తున్న విక్రమ్‌ ల్యాండర్‌.. 30 కిలోమీటర్లకు చేరుకున్న తర్వాత కిందికి దిగడం ప్రారంభించింది. 15 నిమిషాల్లో చంద్రుడిపై అడుగు పెట్టాల్సి ఉంది. గంటకు 6120 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ల్యాండర్‌ వేగాన్ని క్రమంగా తగ్గించారు.

షెడ్యూల్ ప్రకారం అర్థరాత్రి ఒంటి గంట 40 నిమిషాలకు ఇస్రో నుంచి ల్యాండర్‌కు ఆదేశాలు అందాయి. ఆదేశాలు అందగానే.. ల్యాండర్‌కు ఉన్న ఇంజిన్లు స్టార్‌ అయ్యాయి. విక్రమ్‌ ల్యాండర్‌ కిందికి దిగిన కొద్దీ.. వేగం తగ్గుతూ వచ్చింది. అయితే.. చంద్రునికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక్క సారిగా సిగ్నల్స్ కట్ అయ్యాయి. నిజానికి విక్రమ్‌ ల్యాండర్‌ .. 100 మీటర్ల ఎత్తులో ఆగి.. ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం అన్వేషించాల్సి ఉంది. ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా ద్వారా అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటుంది. అయితే సౌత్‌ పోల్‌పై విక్రమ్‌ ల్యాండింగ్‌కు మంజూసన్‌ సి, సింపెలియన్‌ ఎన్‌ అనే రెండు బిలాల మధ్య దిగాల్సి ఉంది.

ఈ ప్రక్రియను ఇస్రో తన సంకేతాల ద్వారా చేయలేదు. చంద్రుడిపై ఉన్న పరిస్థితులకు తట్టుకొని కిందికి దిగేందుకు అనువైన సాంకేతికతను విక్రమ్ ల్యాండర్‌లోనే రూపొందించారు. దీంతో ల్యాండింగ్‌ సమయంలో విక్రమ్‌ తన సొంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడే సిగ్నల్స్ కట్ అయ్యాయి. ఇస్రో సొంతంగా ల్యాండర్‌ను రూపొందించుకుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ల్యాండర్‌, రోవర్‌ను తయారు చేసింది. చంద్రయాన్ – 2 ప్రయోగాన్నిజూలై 22న ప్రయోగించారు. అంతకు ముందు ఒక సారి సాంకేతిక లోపంతో వాయిదా వేశారు. చంద్రుడి సౌత్‌ పొల్‌ మీద దిగడం. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై దిగలేదు. అమెరికా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల రోవర్లు అన్నీ ఉత్తర ధృవంపైనే దిగాయి. ఇప్పుడు భారత విక్రమ్… చందమామని అందుకుందో లేదో క్లారిటీ సంకేతాలు అందాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com