యూరియా కొర‌తే లేద‌న్నారు… ఇప్పుడు చ‌ర్య‌లంటున్నారు!

రైతుల‌కు స‌రిప‌డా యూరియా ల‌భ్యం కావ‌డం లేదు మ‌హ‌ప్ర‌భో అని ఎంత మొత్తుకుంటున్నా… ఇదంతా ప్ర‌తిప‌క్షాల కుట్ర‌, విమ‌ర్శ‌లు మాత్ర‌మే అని చెబుతూ వ‌చ్చారు. కొర‌తే లేద‌నీ, ఎక్క‌డో ఒకటో ట్రెండు చోట్ల కొర‌త ఏర్ప‌డితే… దాన్ని రాష్ట్రమంతా ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలే పెద్ద‌వి చేసి చెబుతున్నాయ‌న్నారు. చివ‌రికి, యూరియా కోసం ఒక రైతు క్యూలైన్లో మ‌రణిస్తే… దాని మీద కూడా వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు వ్య‌వ‌సాయ‌మంత్రి. నిన్న‌టి వ‌ర‌కూ కొర‌తే లేద‌ని చెప్పిన‌వారు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన స‌మీక్ష‌కు వ‌చ్చేస‌రికి… కొర‌త తీవ్రంగానే ఉంది సార్ అనేశారు.

రాష్ట్రంలో ఏర్ప‌డ్డ యూరియా కొర‌త‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. రైతుల‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా యూరియా స‌ర‌ఫ‌రా చేయాలంటూ అధికారుల‌ను ఆదేశించారు. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును వెంట‌నే రైళ్లు, రోడ్డు మార్గాల ద్వారా గ్రామాల‌కు త‌ర‌లించార‌నీ, రాత్రీప‌గ‌లూ తేడా లేకుండా ఈ ప‌ని జ‌ర‌గాల‌న్నారు. యూరియా కోసం రైతులు ఎదురుచూసే ప‌రిస్థితులు ఉండొద్ద‌నీ, ల‌క్ష‌న్న‌ర ట‌న్నుల స్టాకు రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి చేరాల‌ని ఆదేశించారు. నేరుగా గ్రామాల‌కు యూరియా స్టాక్ వెళ్లాల‌న్నారు. ఇంత‌కీ యూరియా కొర‌త‌కు కార‌ణం ఏం చెప్పారో తెలుసా…. డిమాండ్ అధికంగా ఉంది కాబ‌ట్టి అని అధికారులు తేల్చి చెప్పారు!

రాష్ట్రంలో ఏయే పంట‌లు సాగు అవుతున్నాయో, వాటి అవ‌స‌రాలేంటో ముందుగా అంచ‌నా ఉండాల్సింది వ్య‌వ‌సాయ శాఖ‌కి. ఇది ప్ర‌తీయేటా రొటీన్ గా జ‌రిగే కార్య‌క్ర‌మ‌మే. అయితే, ఈ యూరియా కొర‌త‌కి కార‌ణం ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం అనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దాన్ని క‌నిపించ‌కుండా ఉండేందుకు.. డిమాండ్ పెరిగింద‌నీ, పంట‌లు పండించే భూముల సంఖ్య పెర‌గ‌బ‌ట్టే అనూహ్య‌మైన కొర‌త ఏర్ప‌డింద‌నే ఒక పాజిటివ్ యాంగిల్ చూపుతూ విశ్లేషించే ప్ర‌య‌త్రం ప్ర‌భుత్వం చేస్తోంది. పంట‌లు ప‌డించే భూములు పెరిగితే, అవి కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అంచ‌నాలు మార్చుకోవాలి క‌దా! గ‌డ‌చిన పదిరోజులుగా రైతులు రోడ్లెక్కుతున్నా… అబ్బే, అదంతా ప్ర‌తిప‌క్షాల కుట్ర అంటూ కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చారు. ఇదే విశ్లేష‌ణ‌, ఇవే ఆదేశాలు ఓ వారం ముందుంటే దుబ్బాక‌లో రైతు ప్రాణాలు కోల్పోయే ప‌రిస్థితి ఉండేది కాదేమో! స‌మ‌స్య తీవ్ర రూపం దాల్చితే త‌ప్ప ప్ర‌భుత్వం స్పందించ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్న కేసులో దర్యాప్తు అధికారిపై మానవ హక్కుల ఉల్లంఘన అభియోగం..!?

అచ్చెన్న కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని..హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏసీబీ వర్గాల్లో కొత్త కలకలానికి కారణం అవుతున్నాయి. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల...

రైతుకు కేసీఆర్ ఫోన్.. విమర్శలకు సమాధానమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు తక్షణం సమాచారం తెలియాలంటూ.. కొంత మంది కోర్టులను ఆశ్రయిస్తున్న సమయంలో... ఆయన ఓ రైతుతో ఫోన్‌లో మాట్లాడినట్లుగా సీఎంవో మీడియాకు సమాచారం పంపింది. ఫామ్‌హౌస్‌లో...

ఏపీ సీఎంవోలో వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ ప్రకాష్..!

నేను ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అని ఓ సినిమాలో రజనీకాంత్ అంటాడేమో కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. ఒక్క సారి చెబితే...

జగన్ వరం.. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సౌకర్యాలు సరిపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం ప్రైవేటు చికిత్సకు అనుమతులు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ కింద.. కరోనాకు.. చికిత్స...

HOT NEWS

[X] Close
[X] Close