కేసీఆర్ పిలుపు : యాదాద్రికి కేజీల కొద్దీ బంగారం విరాళాలు ..!

వచ్చే ఏడాది మార్చి 28న యాదాద్రి ఆలయాన్ని వైభవంగా పునం ప్రారంభించాలని నిర్ణయించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించాలని సంకల్పించారు. దీనికి 125కిలోల బంగారం అవసరం అవుతుంది. ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టగలిగినప్పటికీ భక్తులకూ చాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.  మొట్ట మొదటి విరాళంగా కేసీఆక్ తన కుటుంబ తరపన 116 తులాల బంగారాన్ని ప్రకటించారు.

కేసీఆర్ ఇలా ప్రకటించిన వెంటనే.. ఇతర నేతల ప్రకటనలు హోరెత్తాయి. ఇటీవ ఐటీ దాడుల్లో వందల కోట్ల బ్లాక్ మనీ బయటపడిన హెటెరో అధినేత పార్థసారధి రెడ్డి రూ. ఐదు కేజీల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరపున ఒక కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఒక కిలో బంగారం, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కిలోల బంగారం, కావేరీ సీడ్స్ అధినేత కావేరీ భాస్కర్ రావు 1 కిలో, నమస్తే తెలంగాణ దామోదర్ రావు కుటుంబం నుంచి 1 కిలో, చినజీయర్ పీఠం నుంచి 1 కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కేజీ ,  మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, శంభిపూర్ రాజు, ఎ   ఎ గాంధీ, ఎం హన్మంతరావు, ఎం కృష్ణా రావు, కేపీ వివేక్ ఆనంద్  వ్యక్తిగతంగా ఒక్కొక్కరు  వారి కుటుంబ సభ్యులు కలసి కేజీ బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇక ఏపీ నుంచి  కేసీఆర్ పిలుపనకు స్పందన వస్తోంది.  వైసీపీ నేత… కడప జిల్లా చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కేజీ బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల నుంచి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఒక్కో గ్రామం నుంచి రూ.11 ఇచ్చినా సరిపోతుందని, తెలంగాణ ప్రజలందరి నుంచి ఈ భావన రావాలని ముఖ్యమంత్రి కోరారు. స్వయంగా ముఖ్యమంత్రే కోరారు కాబట్టి 125 కేజీల కన్నా ఎక్కువే బంగారం యాదాద్రి ఆలయానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close