విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తోందని ఎక్కువగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ గూగుల్ ఒప్పందం, ప్రకటన చూస్తే.. అది డేటా సెంటర్ మాత్రమే కాదు.. ఏఐ హబ్. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్ గా తమ విశాఖ కేంద్రాన్ని గూగుల్ మారుస్తోంది. కానీ వ్యతిరేక ప్రచారం చేసే వారు దీన్ని గుర్తించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఇతరులు కూడా డేటా సెంటర్ అనే అంటున్నారు. గూగుల్ ఏఐ హబ్‌లో డేటా సెంటర్ ఓ భాగం మాత్రమే.
ఏఐ హబ్‌లో డేటా సెంటర్ ఓ భాగం
2025 అక్టోబర్ 14న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అల్ఫాబెట్ కంపెనీ రూ. లక్షా 30 వేల కోట్లతో అమెరికా బయట అతిపెద్ద పెట్టుబడి విశాఖలో పెడుతున్నట్లుగా ప్రకటించారు. దీనిపై సుందర్ పిచాయ్ కూడా మాట్లాడారు. ఈ పెట్టుబడితో విశాఖ రూపు మారిపోతుందని చెప్పారు. విశాఖపట్నంలో 480 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. ఇందులో డేటా హబ్ ఓ భాగం.
భవిష్యత్ అంతా ఏఐదే !
గూగుల్ మొదటి ఏఐ హబ్ కూడా ఇక్కడే నిర్మితం అవుతుంది. అమెరికా బయట అతిపెద్దది. ఇక్కడ గూగుల్ పూర్తి AI స్టాక్ అంటే Gemini AI, Google Cloud సర్వీసులు అందుబాటులో ఉంటాయి. AI డ్రైవెన్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేస్తాయి. విశాఖను భారత తూర్పు తీరంపై గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుంది. సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి 12+ దేశాలతో కనెక్ట్ అవుతుంది.
2 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు గ్యారంటీ
గూగుల్ పెట్టుబడి వల్ల రెండు వందల ఉద్యోగాలు వస్తాయని కొంత మంది వింత వాదన చేస్తున్నారు. ఆ సంస్థ నిర్మించే హబ్‌కు .. సెక్యూరిటీనే ఐదు వందల మందితో వ్యవస్థ ఏర్పడుతుంది. అంత కంటే ఎక్కువ ఉండవచ్చు కూడా. మొత్తంగా ప్రత్యక్ష, పరోక్ష. ఉద్యోగాలు ఈ ఏఐ హబ్ వల్ల రెండు లక్షల వరకూ వస్తాయి. ఈ ప్రాజెక్టు భారతదేశ AI మిషన్‌తో సమన్వయం చేసి, వికసిత భారతాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
దేశ డిజిటల్ రంగానికి విశాఖ కీలకం
ఏఐ హబ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, రీసోర్సులకు కేంద్ర బిందువుగా పనిచేసే ప్రత్యేక . ఇది సాధారణ డేటా సెంటర్ కంటే ముందుండి, AI మోడల్స్ కంప్యూటేషన్ పవర్ (GPUs, TPUs), డేటా స్టోరేజ్, కనెక్టివిటీని ఒకే చోట చేర్చి, AI అప్లికేషన్లను వేగవంతం చేస్తుంది. స్టార్టప్‌లు, బిజినెస్‌లు AI టూల్స్‌ను ఉపయోగించి, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ వంటి సెక్టార్లో మార్పులు తీసుకురావచ్చు. విశాఖ ఏఐ హబ్ భారతదేశాన్ని గ్లోబల్ AI మ్యాప్‌లో ముఖ్య హబ్‌గా మారుస్తుంది, ఇలాంటి హబ్‌లు AI రీసెర్చ్, టెస్టింగ్, డెప్లాయ్‌మెంట్‌కు సహాయపడతాయి. ఇది AIని సాధారణీకరించడానికి, ఎకానమీని బూస్ట్ చేయడానికి కీలకం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను “AI సిటీ”గా మార్చి, భారతదేశ డిజిటల్ భవిష్యత్తును రూపొందిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులు గుర్తించారు. కానీ కుల, రాజకీయ దుగ్ధతో సొంత ఇంటికి నిప్పు పెట్టుకునే అజ్ఞానులకు మాత్రం ఇంకా అర్థం కావడం లేదు.
