ఫ్లాప్ కాంబో… గోపీచంద్ త‌ప్పు చేస్తున్నాడా?

ఫ్లాపుల‌తో హ్యాట్రిక్ కొట్టిన హీరో.. గోపీచంద్‌. న‌వ‌త‌రం హీరోల జోరు ఎక్కువ‌వుతున్న త‌రుణంలో గోపీచంద్ మ‌ళ్లీ హీరోగా నిల‌దొక్కుకోవ‌డం, హిట్ కొట్టడం కష్ట‌సాధ్య‌మైన విష‌యాలుగా మారాయి. ప్ర‌స్తుతం `చాణక్య‌`గా క‌నిపించ‌బోతున్నాడు గోపీచంద్. ఈ సినిమాపైనే గోపీచంద్ ఆశ‌ల‌న్నీ. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ `ఓకే` అనిపించుకుంది. ఈద‌శ‌లో గోపీచంద్ ఆచి తూచి అడుగులేయాలి. స‌రైన క‌థ‌ల్ని, ద‌ర్శకుల్ని ఎంచుకుని ముందుకు వెళ్లాలి. గోపీచంద్‌పై న‌మ్మ‌కంతో పెట్టుబ‌డి పెట్టే నిర్మాత‌లు ఇంకా ఉన్నారు. వాళ్ల‌ని కాపాడుకోవాలంటే.. గోపీచంద్ ముందున్న మార్గం మంచి కాంబినేష‌న్ల‌ని సెట్ చేసుకోవ‌డ‌మే. అయితే… ఏరి కోరి ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చాడు గోపీ.

సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `గౌత‌మ్ నంద‌` ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి సంప‌త్ నంది భారీగా ఖ‌ర్చు పెట్టించాడు. అందులో స‌గం కూడా వెన‌క్కి రాలేదు. అప్ప‌టి నుంచి సంప‌త్‌నంది క‌థ‌లు ప‌ట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే ఆ ద‌ర్శ‌కుడికే మ‌ళ్లీ గోపీచంద్ అవ‌కాశం ఇచ్చాడు. చాలా రోజుల నుంచి, చాలా మంది హీరోల ద‌గ్గ‌ర న‌లుగుతున్న క‌థ‌కు.. గోపీ ప‌చ్చ‌జెండా ఊప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. హిట్ కాంబోని వెంట‌నే రిపీట్ చేయాల‌ని చూసే హీరోలు.. ఫ్లాప్ కాంబో జోలికి వెళ్ల‌డానికి ధైర్యం చేయ‌రు. అదీ వెంట వెంట‌నే సినిమా తీయ‌డానికి అస్స‌లు ఒప్పుకోరు. కానీ.. గోపీచంద్ మాత్రం ఆ సాహ‌సం చేస్తున్నాడు. 2020 ప్ర‌ధ‌మార్థంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. మ‌రి ఈసారి గోపీచంద్ లెక్క ఏమ‌వుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com