ఢిల్లీలో హోంశాఖ అధికారులతో గౌతం సవాంగ్ చర్చలు..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. సాధారణంగా డీజీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా వెళ్లి హోంశాఖ అధికారులతో సమావేశం కారు. పిలుపు వస్తేనో లేకపోతే.. సమావేశాలు ఉంటేనే వెళ్తారు. అన్ని రాష్ట్రాల డీజీపీలతో జరిగే సమావేశాలు లేదా.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం ఇలా.. ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాలకు వెళ్తారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోయినా… గౌతం సవాంగ్ ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పోలీసులకు సంబంధించిన ఓ ముఖ్య కార్యక్రమం ఉన్నా.. ఆయన హాజరు కాలేదు. ఆటోలు, క్యాబుల్లో ప్రయాణికుల భద్రత కోసం.. అభయం అనే యాప్‌ను రూపొందించారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

సాధారణంగా నేరుగా పోలీసులకు సంబంధం లేకపోయినా.. చాలా కార్యక్రమాల్లో ఇలా జగన్మోహన్ రెడ్డి ల్యాప్ ట్యాప్ మీట నొక్కే కార్యక్రమానికి డీజీపీ సవాంగ్ హాజరవుతారు. సీఎం కూర్చుని ఉంటే.. ఆయన వెనుక నిలబడి ఉండే.. మంత్రులు, ఉన్నతాధికారుల్లో ఆయన కూడా ఉండేవారు. కానీ ఈ సారి మాత్రం ఆయన లేదు. ఇతర అధికారులు నిలబడి ఉన్నారు. దీంతో గౌతం సవాంగ్ ఢిల్లీ వెళ్లారన్న విషయం అధికారవర్గాల్లో ప్రచారానికి వచ్చింది. ఇటీవలి కాలంలో పలువురు ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుల ఆప్షన్ పెట్టుకుంటున్నారు. కోర్టుల నుంచి పదే పదే హెచ్చరికలు వస్తున్నాయి.

మూడు సందర్భాల్లో పోలీసులపై సీబీఐ విచారణ కూడా ఆదేశించింది. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని కోర్టు పదే పదే విమర్శిస్తోంది. అదే సమయంలో కోర్టుల్ని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వ్యవహారశైలిపై కేంద్రానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి సమయంలో.. గౌతం సవాంగ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం.. కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశం అవడం… రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

చంపడానికి కూడా సిద్ధమంటున్న ఉద్యోగ సంఘాల రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల "సామాజిక" భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా...

దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు...

బిడెన్ ప్యాకేజీ : ఒక్కో అమెరికన్ పౌరునికి రూ. లక్షన్నర..!

నల్లధనాన్నంతా వెనక్కి తెస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షలేస్తాం అని బీజేపీ చెప్పింది కానీ.. ఇప్పటి వరకూ వేసింది లేదు.. కానీ నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చామని కూడా చెప్పారు. దీంతో...

HOT NEWS

[X] Close
[X] Close