కేసీఆర్ “గ్రేటర్” మేనిఫెస్టో : టీఆర్ఎస్‌ గడ్డు పరిస్థితికి సాక్ష్యమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఊహించని వరాలు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కరూ అంతో ఇంతో సంతోషపడేలా వరాలతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఆల్ ఫ్రీ హామీల్లో తక్షణం అమల్లోకి వచ్చేది నీటి పన్ను రద్దు. నెలకు ఇరవై వేల లీటర్ల వాడుకునే కుటుంబాలు ఇక నీటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. హైదరాబాద్‌లో 98 శాతం మందికి నీటి పన్ను బాధ తప్పుతుందని కేసీఆర్ ప్రకటించారు. అది బెంచ్ మార్క్ హామీ మాత్రమే… దాదాపుగా గంటసేపు సాగిన ఆయన ప్రసంగంలో.. హామీలు వరదలా పారాయి. డిసెంబర్‌ నుంచి సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌, వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్ల పునరుద్ధరణ, లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్ను రద్దు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ.. ఎల్టీ కేటగిరిలకు కనీస డిమాండ్‌ ఛార్జీల మినహాయింపు వంటి హామీలు ఉన్నాయి.

ఇక మేనిఫెస్టో ప్రకటించే ముందు రోజే సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి.. తమను ఆదుకోవాలని కోరారు. వారిని నిరాశపర్చకుండా మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున వరాలు ప్రకటించారు. అందులో సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీల రద్దు, 10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ వంటి హామీలు ఉన్నాయి. అలాగే.. షోలు పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతి .. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక మాదిరిగా టికెట్లు ధరలు సవరించుకునే అవకాశం కూడా ఇస్తామన్నారు. ఇక మొన్నటి వరదల తర్వాత హైదరాబాద్‌కు సమగ్రమైన సీవరేజీ వ్యవస్థ అవసరమని గుర్తించి.. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే.. హైదరాబాద్‌ మహానగరానికి సమగ్ర సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామన్నారు. వరద నీటి నిర్వహణకు మాస్టర్‌ ప్లాన్‌, 12 వేల కోట్ల ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చడమే కాదు.. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయికి మార్చడానికి అవసరమైన మౌలిక సదుపాయాల గురించి కూడా ప్రకటించారు. అందులో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు… బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు మెట్రో విస్తరణ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌.. మరో 90 కిమీ మేర ఎంఎంటీఎస్‌ రైళ్లు హామీలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ రోడ్లు.. ఔటర్‌ రింగురోడ్డు అవతల మరో రింగురోడ్డు.. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ నలువైపులా ఐటీని విస్తరించి.. ప్రైవేట్‌, ఐటీ రంగాల్లో లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ టెన్షన్ ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మరికొన్ని వరాలు ప్రకటించారు. ప్రభుత్వ స్థలాలు, వివాదాస్పద స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి స్థలాల క్రమబద్ధీకరణ, స్థలాలు ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల సాయం, అర్హులందరికీ సామాజిక భద్రత పెన్షన్లు, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఈ-లైబ్రరీలు, ఇంటర్నెట్‌ సౌకర్యం, సీనియర్‌ సిటీజన్ల కోసం ప్రతి డివిజన్‌లో ల్రైబరీ.. సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్‌, యోగా సెంటర్‌, జిమ్‌, ఉచితంగా బస్‌పాస్‌లు హామీల వరద కేసీఆర్ పారించారు.

పనిలో పనిగా కేసీఆర్ .. బీజేపీ పేరు నేరుగా చెప్పకపోయినా.. టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే.. హైదరాబాద్‌లో ఏదో జరిగిపోతుందన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించారు. మత కల్లోలాలు జరుగుతాయన్నారు. అలా జరిగితే…ఆస్తుల విలువ పడిపోతుందన్నారు. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేటప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ప్రత్యేకంగా భారీ హామీలేమీ ఇవ్వలేదు. కానీ.. గ్రేటర్‌లో మాత్రం రెండో సారి గెలవడానికి సాధ్యమా అని ఆలోచించాంచాల్సినంత హామీలు ఇచ్చారు. వీటిని ప్రజలు నమ్ముతారో.. టీఆర్ఎస్‌కు కష్టంగా ఉంది కాబట్టి.. ఇలాంటి హామీలిచ్చారని అనుకుంటారో.. వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏకగ్రీవం చేసుకోకపోతే అనర్హతా వేటేస్తారా..!?

పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ...

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు కరోనా భయం పోయింది..!

సుప్రీంకోర్టు తీర్పునైనా ధిక్కరిస్తామని ఒకరు...మా ప్రాణానికి హాని కల్పిస్తే చంపడానికైనా సిద్ధమని మరొకరు.. మమ్మల్ని ఆదేశించడానికి ఎస్ఈసీ ఎవరని మరొకరు.... వరుసగా ఒకరి తర్వాతా ఒకరు మీడియా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్లులా...

టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని... ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే...
video

అర్థ శ‌తాబ్దం – మ‌రో ప్ర‌శ్నాస్త్రం

https://www.youtube.com/watch?v=KZlgjWutVys&feature=youtu.be ప్ర‌శ్నించ‌డానికి స‌మాజం, వ్య‌క్తులు, సంఘాలూ, వ్య‌వ‌స్థ‌లూ అవ‌స‌రం లేదు. అప్పుడ‌ప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్య‌త తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్ర‌శ్నించ‌డానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తోంది. అదే.....

HOT NEWS

[X] Close
[X] Close