కేసీఆర్ వ‌రాలు: షోలు ఎన్నంటే అన్ని.. టికెట్ రేట్లూ మీ ఇష్ట‌మే

చిత్ర‌సీమ‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. రోజుకి ఎన్నంటే అన్ని ఆట‌లు ప్ర‌ద‌ర్శించుకునేందుకు, టికెట్ రేట్ల‌ను సీజ‌న్‌ని బ‌ట్టి, డిమాండ్ ని బ‌ట్టి పెంచుకునేందుకు థియేట‌ర్ యాజ‌మాన్యానికి అనుమ‌తులు ఇచ్చేశారు. ఈరోజు సీఎమ్ ప్రెస్ మీట్లో… చిత్ర‌సీమ‌పై బాగా క‌నిక‌రం చూపించిన‌ట్టు క‌నిపించింది. 10 కోట్ల లోపు నిర్మించే చిత్రాలకు జీఎస్‌టీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. చిన్న సినిమాల‌కు ఇది భారీ ఊర‌ట‌. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు చాలా న‌ష్ట‌పోయాయి. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు క‌రెంటు బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌రో వ‌రం ప్ర‌క‌టించారు.

అన్నీ బాగానే ఉన్నా, టికెట్ రేట్ల పెంపు విష‌యంలో నిర్ణ‌యం తీసుకునే అధికారం థియేట‌ర్ యాజ‌మాన్యానికి వ‌దిలేయ‌డం మాత్రం.. ప్రేక్ష‌కుడి న‌డ్డి విర‌గ‌డం ఖాయం అన్న సంకేతాల్ని పంపుతోంది. ఇప్ప‌టికే మ‌ల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే 150 వ‌దిలించుకోవాల్సివ‌స్తోంది. కొత్త సినిమా విడుద‌ల అయిన రోజు టికెట్ రేటు 500 పెంచినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. నిర్మాత‌ల‌కు ఓ విధంగా ఇది లాభ‌దాయ‌క‌మైన నిర్ణ‌యం. కాక‌పోతే.. ప్రేక్ష‌కుల ప‌రిస్థితే ఆలోచించుకోవాలి. మొన్న‌టి వ‌రకూ.. బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి లేదు. ఫ్యాన్స్ షోలు ప‌డేవి కావు. ఇప్పుడు‌… వీటికీ గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ‌లో థియేట‌ర్లు బంద్‌

అనుకున్న‌దంతా అయ్యింది. కోవిడ్ ప్ర‌భావంతో... చిత్ర‌సీమ అల్లాడుతోంది. షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లు ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా థియేట‌ర్లే బంద్ అయ్యాయి. కోవిడ్ కార‌ణంగా తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసేస్తున్నామ‌ని ఎగ్జిబీట‌ర్ల సంఘం ప్ర‌క‌టించింది....

ఇక ఆ ఎన్నికల జోలికి వద్దనుకుంటున్న ఏపీ సర్కార్..!?

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పనిలోకి దిగారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోలేదు. ఆ వివాదం ......

ఏపీలో సంస్కారం తెలీని లీడర్ ఆయనొక్కరే..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 72వ ఏట అడుగు పెట్టారు. ఆయనంటే అభిమానం ఉండి.. చెప్పాలి అనుకున్న వాళ్లు చెప్పారు. టీడీపీ క్యాడర్ కేకులు కట్...

అందరికీ వ్యాక్సిన్ సరే.. అసలు స్టాకేది..!?

దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీ నిర్ణయించారు. మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపింది. వైరస్ మీదపడిపోతున్న సమయంలో ఇది రిలీఫ్...

HOT NEWS

[X] Close
[X] Close