గంగూలీ మొండిత‌నం విలువ రూ. 4వేల కోట్లు

మైదానంలోనే కాదు, బ‌య‌ట కూడా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌డ‌ని గంగూలీ మ‌రోసారి నిరూపించుకున్నాడు. క‌రోనా భ‌యంతో.. ప్ర‌పంచం అంతా అట్టుడికిపోతున్న త‌రుణంలో ఐపీఎల్ నిర్వ‌హించాల‌న్న గంగూలీ ప్ర‌తిపాద‌న అప్పట్లో నివ్వెర ప‌రిచింది. కాసుల కోసం… గంగూలీ పెద్ద రిస్క్ చేస్తున్నాడ‌ని, ఆట‌గాళ్లు క‌రోనా బారీన ప‌డితే ప‌రిస్థితి ఏమిట‌న్న విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. బీసీసీఐలోని కొంత‌మంది పెద్ద‌లు.. గంగూలీ నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లో త‌ప్పుబ‌ట్టారు. మ‌రి కొంత కాలం ఆగాల‌ని, లేదంటే… ఈసారికి టోర్నీని పూర్తిగా ఆపేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు. కానీ గంగూలీ ఎవ‌రి మాటా విన‌లేదు. గంగూలీ వేసిన స్కెచ్ తో…. ఏకంగా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్పే వాయిదా ప‌డి, ఐపీఎల్ కి మార్గం సుగ‌మం అయ్యింది.

గంగూలీ ప్లానింగ్ అద్భుతంగా సాగి, ఐపీఎల్ 13 విజ‌య‌వంతంగా న‌డిచింది.. ఎలాంటి టెన్ష‌న్లూ లేకుండా దిగ్విజంగా ఈ టోర్నీని పూర్తి చేయ‌గ‌లిగింది బీసీసీఐ. ఇప్పుడు ఈ టోర్నీ ద్వారా బీసీసీఐకి ఏకంగా 4 వేల కోట్లు వ‌చ్చాయి. కరోనా కాలం, పైగా పెద్ద పెద్ద స్పాన్స‌ర్లు హ్యాండిచ్చిన వేళ‌, స్టేడియంలో ప్రేక్ష‌కులు క‌రువై, చీర్ గాళ్స్ లాంటి అద‌న‌పు హంగులు లేని వేళ‌… ఇంత స్థాయిలో బీసీసీఐ ఆదాయం ఆర్జించ‌గ‌లిగిందంటే… మామూలు విష‌యం కాదు.

ఖ‌ర్చులు త‌గ్గించి అద‌న‌పు ఆదాయ మార్గాల్ని అన్వేషించ‌డంలో బీసీసీఐ విజ‌యం సాధించ‌గ‌లిగింది. పైగా.. ఈసారి వ్యూవ‌ర్ షిప్ కూడా ఎక్కువ స్థాయిలో న‌మోదైంది. అందుకే ఈస్థాయిలో ఆదాయం రాబ‌ట్ట‌గ‌లిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏకగ్రీవం చేసుకోకపోతే అనర్హతా వేటేస్తారా..!?

పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ...

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు కరోనా భయం పోయింది..!

సుప్రీంకోర్టు తీర్పునైనా ధిక్కరిస్తామని ఒకరు...మా ప్రాణానికి హాని కల్పిస్తే చంపడానికైనా సిద్ధమని మరొకరు.. మమ్మల్ని ఆదేశించడానికి ఎస్ఈసీ ఎవరని మరొకరు.... వరుసగా ఒకరి తర్వాతా ఒకరు మీడియా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్లులా...

టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని... ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే...
video

అర్థ శ‌తాబ్దం – మ‌రో ప్ర‌శ్నాస్త్రం

https://www.youtube.com/watch?v=KZlgjWutVys&feature=youtu.be ప్ర‌శ్నించ‌డానికి స‌మాజం, వ్య‌క్తులు, సంఘాలూ, వ్య‌వ‌స్థ‌లూ అవ‌స‌రం లేదు. అప్పుడ‌ప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్య‌త తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్ర‌శ్నించ‌డానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తోంది. అదే.....

HOT NEWS

[X] Close
[X] Close