బంగార్రాజు.. మొద‌లెట్టేస్తున్నారా?

నాగార్జున కెరీర్‌లో అతి పెద్ద విజ‌యం `సోగ్గాడే చిన్ని నాయిన‌`తో ద‌క్కింది. దాదాపు 50 కోట్లు వ‌సూలు చేసిన సినిమా ఇది. ఆ త‌ర‌వాత‌.. సోగ్గాడేకి.. సీక్వెల్ గా `బంగార్రాజు` చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. క‌ల్యాణ్ కృష్ణ సైతం.. ఆ స్క్రిప్టు ప‌నులు ఎప్పుడో పూర్తి చేశారు. అయితే.. క‌థ‌లో కొన్ని సందేహాలు ఉండ‌డంతో, స్క్రిప్టు తాను అనుకున్న విధంగా రాక‌పోవ‌డంతో ఈ సీక్వెల్ ని ప‌క్క‌న పెట్టారు నాగ్‌. క‌ల్యాణ్ కృష్ణ కూడా వేర్వేరు ప్రాజెక్టుల‌లో ప‌డిపోయాడు.

ఇప్పుడు మ‌ళ్లీ `బంగార్రాజు`పై నాగార్జున దృష్టి పెట్టిన‌ట్టు టాక్‌. ఇటీవ‌ల‌… క‌ల్యాణ్ కృష్ణ నాగ్ ని క‌లిసి ఫైన‌ల్ నేరేష‌న్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈసారి క‌థ విష‌యంలో నాగ్ పూర్తి సంతృప్తిని వ్య‌క్త ప‌రిచార్ట‌. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా ఉండ‌బోతోంది. ఈసారి నాగ‌చైత‌న్య కూడా నాగ్ తో క‌ల‌సి న‌టించ‌బోతున్నాడు. చైతూ కాల్షీట్లు సైతం దొర‌కాల్సివుంది. అందుకే.. షూటింగ్ షెడ్యూల్ ఆల‌స్యం అవుతోంది. ఏదేమైనా.. వారం ప‌ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. డిసెంబ‌రులో గానీ, 2021 జ‌న‌వ‌రిలో గానీ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

రేప్ కేసు కూడా పెట్టేసిన ఏపీ పోలీసులు..!

" ఇవన్నీ కాదు కానీ నేను నిన్ను పాడు చేశానని కేసు పెట్టు... నేను కూడా నిజమేనని ఒప్పుకుని జైలుకు వెళ్తా...!" అని ఓ సినిమాలో హిరోయిన్ సిమ్రాన్‌తో కమలహాసన్ అంటాడు....

మళ్లీ దక్షిణాది వాదం అందుకున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీపై దూకుడుగా ఉన్న సమయంలో దక్షిణాది వాదం వినిపించేవారు. దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నుల ఆదాయం పొందుతున్న కేంద్రం.. వాటిని మొత్తం ఉత్తరాదిలో ఖర్చు పెడుతోందని...

సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ సర్కార్‌ది ధిక్కరణేనా..!?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎవరి మాటా వినాలనుకోవడం లేదు. హైకోర్టుపై నమ్మకం ఉందని.. ఏం చెప్పినా పాటిస్తామని మాటిచ్చి కూడా.. హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అనుకూల...

HOT NEWS

[X] Close
[X] Close