క్రైమ్ : భార్యను ఆన్‌లైన్‌లో పెట్టిన భర్త..!

టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే అభివృద్ది చెందవచ్చు… చెడుగా వాడుకుంటే చెడిపోవచ్చు. గుంటూరులో వంశీరెడ్డి అనే యువకుడు చెడుగా వాడుకున్నాడు. డబ్బు సంపాదన కోసం అశ్లీల సైట్లు.. యాప్‌ల బారిన పడి.. చివరికి తన భార్యనే.. వాటికి పెట్టుబడిగా మార్చాడు. డబ్బు సంపాదన కోసం కక్కుర్తి పడి.. కట్టుకున్న భార్యనే ఆన్‌లైన్‌లో పరిచయమైన వారికి తార్చే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ భార్యకు విషయం తెలిసి.. పోలీసులకు ఆశ్రయించడంతో గుట్టు మొత్తం రట్టయింది.

గుంటూరు ఏటీ అగ్రహారంలో నివాసం ఉండే వంశీ రెడ్డి.. తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో.. వ్యాపారం చేస్తున్నానని తిరుగుతూ ఉండేవాడు. ఓ కొరియర్ ఏజెన్సీని పెట్టి మూసేశాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు లేకపోవడంతో… భార్య అందాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. మొదట.. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి.. అశ్లీల సైట్లకు అమ్మేవాడు. తర్వాత ఏకంగా లైవ్ పెట్టేవాడు. ఆ విషయం తెలియని భార్య… తన భర్తతో సంసారం చేస్తున్నానని అనుకునేది.

కొన్నాళ్ల తర్వాత వంశీ రెడ్డి.. భార్యను ఆన్ లైన్‌లో పరిచయం అయిన వారి వద్దకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద ఈ ప్రతిపాదన పెట్టాడు. అది విని ఆమె హతాశురాలైంది. అయితే.. అలా వెళ్లకపోయినా.. ఎవరికైనా చెప్పినా చచ్చిపోతానంటూ వంశీరెడ్డి..సైకోలా తనను తాను గాయపర్చుకునేవాడు. చివరికి.. అతని వేధింపులు తాళలేక భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. దిశ పోలీసులు వంశీ రెడ్డి టెక్నికల్ హిస్టరీ అంతా వెలికి తీసి నోరెళ్లబెట్టారు. కట్టు కున్న బార్యతో అలా ఆన్ లైన్‌లో అశ్లీల వ్యాపారం చేయడం .. వంశీరెడ్డి నేర ప్రవృత్తికి నిదర్శనం అని అంటున్నారు.

నిజానికి అసలు వంశీ రెడ్డి ఆ యువతిని మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నారు. తాను ఎయిర్ ఫోర్స్‌లో పని చేస్తానని చెప్పి.. పెళ్లి చేసుకున్నారు. కనీ అతను ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కాదని పెళ్లి తర్వాతతెలిసింది. పెళ్లయిపోయింది కదా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకని.. పెద్దలు రాజీ చేసి..కాపురానికి పంపారు. చివరికి అతను భార్యను అంగట్లో పెట్టేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close