జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలపై దెబ్బ..!

అనంతపురం జిల్లాలో తిరుగులేని నేతలుగా గుర్తింపు తెచ్చుకున్న జేసీ బ్రదర్స్ కు గడ్డు కాలం వచ్చింది. జగన్మహోన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇబ్బందులెదురయ్యే పరిస్థితి వచ్చింది. జేసీ బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నారు. వంద బస్సులకుపైగానే ఇంటర్ స్టేట్ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు.. ఆ బస్సుల్లో 31 బస్సులను ఏపీ రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. దానికి వారు చాలా కారణాలు చెప్పారు. అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవడం… అధిక ధరలు వసూలు చేయడం… స్టేజ్ కేరియర్లుగా తిప్పడం వంటివి. అయితే.. ప్రతీ ట్రావెల్స్ బస్సుపైనా ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇతర ట్రావెల్స్ బస్సుల్ని నామమాత్రంగా సీజ్ చేసిన రవాణా అధికారులు… జేసీ బ్రదర్స్‌కు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేయడమే కాదు.. పర్మిట్లను కూడా రద్దు చేశారు.

ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా.. జేసీ బ్రదర్స్… తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. రాజకీయ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనడంలేదు. టీడీపీ జెండా కింద కాకుండా.. సొంతంగానే… జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వైసీపీకి కాస్త సపోర్ట్ గా నే ప్రకటనలు చేస్తున్నారు. తరచూగా.., బీజేపీలోకి వెళ్లబోతున్నారన్న ప్రచారాన్ని కూడా… వార్తల్లోకి వచ్చేలా చేస్తున్నారు. కొంత మంది బీజేపీ పెద్దలతోనూ జేసీ దివాకర్ రెడ్డి సమావేశమైనట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికే తాడిపత్రిలో… జేసీ ముఖ్య అనుచరులు పలువురిపై కేసులు పెట్టారు. ప్రబోధానంద ఆశ్రమంపై దాడి ఘటనలో… పలువురు జేసీ అనుచరులను తాజాగా అరెస్టులు చేయడం ప్రారంభించారు. దీంతో జేసీ బ్రదర్స్‌కు ఉక్కపోత ప్రారంభమయింది. ఓ వైపు అనుచరులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వ్యాపారాలుపై… ప్రభుత్వం గురి పెట్టింది. వీటిపై జేసీ సోదరులు ఎలా వ్యవహరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close