ఏం జరిగినా ఇదిగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ రచ్చ రాజకీయాలు చేసే వైసీపీకి సరైన టైం చూసి ముకుతాడు వేసింది ప్రభుత్వం. వారి బలహీనతపై గట్టిగా దెబ్బకొట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. శాసనమండలిలో ఈ తీర్మానంపై వైసీపీకి మద్దతివ్వక తప్పలేదు. మద్దతివ్వక చస్తారా.. మద్దతివ్వకపోతే చస్తారని అనుకున్న ఎమ్మెల్సీ సైలెంట్ గా జై కొట్టారు.
అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని వైసీపీ అంగీకరించి.. అందుకే కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలిపిందన్నమాట . ఈ విషయంపై ఎప్పుడైనా వైసీపీ నేతలు పిచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే.. వారికి ఈ తీర్మానం గట్టి షాక్ ఇస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం లేదని.. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చెబుతున్నా.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పది వేల కోట్లకుపైగా ఆర్థిక సాయం స్టీల్ ప్లాంట్ కు అందింది. మళ్లీ గాడిన పడే పరిస్థితి కనిపిస్తోంది.
మరోసారి వైసీపీ ప్రైవేటీకరణ పేరుతో రాజకీయం చేయకుండా.. శాసనమండలి ద్వారా ఇలా ఫిక్స్ చేసింది టీడీపీ. కేంద్రాన్ని ఏ మాత్రం ఎదిరించలేని ఘోరమైన దుస్థితిలో ఉన్న వైసీపీని ఎలా ఆడుకోవాలో.. అలా ఆడుకుంటున్నారు నారా లోకేష్. కేంద్రాన్ని ఏ మాత్రం .. విమర్శించినా తమ పుట్టి మునిగిపోతుందని వారు భయపడుతున్నారు. అందుకే అభినందనలు తెలుపుతున్నారు. మద్దతు తెలియచేస్తున్నారు.