ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి. అతి తక్కువ ఫీజులతో విద్యా సేవ అందిస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. అయితే ఇప్పుడు వాటిని ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. వాటికి ఉన్న వేలాది ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడిందన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే వాటిని ఏమి చేసుకోవడానికైనా హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జీవోలోనే ప్రకటించారు.

విజయవాడలోని మాంటిస్సోరి స్కూల్ ను మూసేశారు. ప్రభుత్వానికి అప్పగించడం ఇష్టం లేక అలాగని ప్రైవేటు స్కూల్ తరహాలో నడపలేక మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. అరవై ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ అది. బాలికల విద్య కోసం శ్రమించిన స్కూల్ అది. అలాంటివి ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వాటి స్థలాను లాగేసుకోవడం కాబట్టి అధికారులతో ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రభుత్వం బెదిరిస్తోందని హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

ఎయిడెడ్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటంతో చాలా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ ఎయిడ్ లేకపోవడంతో ఆయా విద్యా సంస్థలు నడవడం కూడా కష్టంగా మారింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో వేరేగా ఉంది. ఎలా చూసినా ప్రస్తుతం ఎయిడెడ్ వ్యవహారం విద్యార్థులకు కష్టంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు పెరగడానికి కారణం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట...

హైకోర్టులో జగన్ అండ్ కో పిటిషన్ల రోజువారీ విచారణ!

అక్రమాస్తుల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జగన్ తో పాటు ఆయన సహ నిందితులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు...

రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ...

పూరికి కోట్ల పబ్లిసిటీ ఇచ్చిన ప్రభాస్ !

పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్...

HOT NEWS

[X] Close
[X] Close