‘శ్రీమంతుడు’ ఆడియో పోస్టర్ విడుదల చేసిన నిర్మాతలు

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం శ్రీమంతుడు వచ్చేనెల 7వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో వచ్చే శనివారం శిల్పకళావేదికలో జరగనుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు ఆడియో విడదలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఈ చిత్రం ఆడియో రిలీజ్ పోస్టర్‌ను మీడియాకు విడుదల చేశారు. మిర్చి వంటి సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, బడ్జెట్‌ను నియంత్రించటానికి ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. వాస్తవానికి ఈ నెల 17నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బాహుబలి చిత్రం కారణంగా దీనిని వాయిదా వేశారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com