జయలలితకు కిడ్నీ ప్రాబ్లమ్?

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జయ బయట కనిపించిందిలేదు. ప్రమాణ స్వీకారంనాడుకూడా నడవటానికి ఇబ్బందిగా పడ్డట్లు కనిపించారు. ఆ తర్వాత సెక్రటేరియట్‌కు రెండుసార్లుమాత్రమే వచ్చారు. ఇక క్యాబినెట్ సమావేశం ఒక్కసారికూడా జరగలేదు. గత నెలలో ప్రారంభమైన చెన్నై మెట్రోనుకూడా ఆమె నేరుగా హాజరుకాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా, జయ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, కిడ్నీగానీ, లివర్‌గానీ దెబ్బతిని ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.  మరోవైపు ఇదే అదనుగా డీఎమ్‌కే అధినేత కరుణానిధి జయపై దాడి ప్రారంభించారు. ఆమె విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, ముఖ్యమంత్రిస్థాయివ్యక్తి పారదర్శకంగా ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయలలితకు ఏమైనా జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపుచేయటం ఎలారా బాబూ అని తమిళనాడు పోలీసులు భయంతో వణికిపోతున్నారట!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

FTL, బఫర్‌ జోన్లు అంటే ఏమిటంటే ?

ఇప్పుడు అందరూ చెరువులు, హైడ్రా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఎఫ్‌టీఎల్ అంటే ఏమిటి.. బఫర్ జోన్ అంటే ఏమిటి అన్నదానిపై చాలా మందికి క్లారిటీ ఉండటం...

ఈ హీరోయిన్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్‌!

కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి హిట్ 'ఉప్పెన'తో కొట్టింది కృతిశెట్టి. తెలుగులో ఇది తనకు తొలి సినిమా. అంతకుముందు హిందీ సినిమా సూపర్ 30లో ఓ చిన్న...

అపార్టుమెంట్ కొనుక్కుంటే విలువ పెరగదా ?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కొరిక. సొంత ఇల్లు అంటే... చుట్టూ ఖాళీ స్థలం, కొన్ని చోట్లు .. ఉండేలా పొందికైనా ఇల్లు అని గతంలో ఊహించుకునేవారు. ఇప్పుడు...

పీవోకేని కలుపుకునేందుకు కేంద్రం కొత్త వ్యూహం ?

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్‌లో కలుపుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రం కొత్త ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం కశ్మీర్ ఎన్నికలు జరుగుతూండటమే కాదు.. పీవోకేలో నెలకొన్న పరిస్థితులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close