మోడీకి షాక్… మాట తప్పిన పాక్

పక్కలో బల్లెంలో పదే పదే వెర్రివేషాలు వేస్తున్న పాకిస్తాన్ తో ఇక చర్చలు వద్దని దేశంలో చాలా మంది అభిప్రాయం. దౌత్య, రాజకీయ నిపుణులూ ఇదే సూచన చేస్తున్నారు. అయినా, రష్యాలో ని ఉఫాలో లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరిపారు. ఈ చర్చలు వృథా అని అప్పుడే కాంగ్రెస్ విమర్శించింది. చివరికి అదే నిజమైంది.

మొన్న మోడీకి ఇచ్చిన ప్రతి హామీనీ పాక్ ఉల్లంఘించింది. ముంబై ముట్టడి దర్యాప్తులో భాగంగా ఉగ్రవాద నాయకుడు లఖ్వీ వాయిస్ శాంపిల్ ను పంపిస్తామని నవాజ్ షరీఫ్ మాట ఇచ్చారు. కానీ ఆ ప్రసక్తే లేదని లఖ్వీ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెగేసి చెప్పారు. వారి మాటలను పాక్ ప్రభుత్వం ఖండించలేదు. ఉఫా లో జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో కాశ్మీర్ అంశం లేదు. ఇది గొప్ప విజయమని బీజేపీ నేతలు ప్రకటించారు. ఇది జరిగిన 72 గంటల్లోనే పాక్ షాకిచ్చింది. భవిష్యత్తులో భారత్ తో ఏ చర్చలు జరిగినా కాశ్మీర్ అంశం ఉండాల్సిదే అని పాక్ రక్షణ సలహాదారు స్పష్టం చేశారు.

కాశ్మీర్ అంశం ఎజెండాలో లేకపోతే చర్చల ప్రసక్తే లేదని తేల్చేశారు. నిన్న మొన్నటి వరకూ ఏదో విధంగా భారత్ తో చర్చల కోసం దేబిరించిన పాక్ కు ఇప్పుడు ఇంత నోరు ఎలా వచ్చింది? ఉఫాలో మోడీ చర్చలు జరపడం వల్ల. ఆయన సదుద్దేశంతో చర్చించినా పాకిస్తాన్ అణవణువూ దురుద్దేశమనే విషయం మర్చిపోయారు.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే, ఇద్దరు ప్రధానుల సమావేశం జరగడానికి ముందు రోజే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ మర్నాడూ అదే పని చేసింది. గత రెండురోజులుగా ఉగ్రవాదలను సరిహద్దులు దాటించడానికి ప్రయత్నించింది. ఆదివారం నాడు ముగ్గురు చొరబాటు దార్లను మన భద్రతా దళాలు కాల్చి చంపాయి. సోమవారం ఉదయం ఇదే ప్రయత్నం చేసిన మరో ఉగ్రవాదినీ జవాన్లు కాల్చి చంపారు. ఇన్ని జరుగుతున్నా పాక్ తో చర్చలు ఏమిటని దేశ పౌరులు మండిపడుతున్నారు. పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పడం ఎలాగో ప్రధాని మోడీ ఆలోచించాలని కోరుతున్నారు. డైనమిక్ ప్రధాని వచ్చారనే తమ నమ్మకాన్ని మోడీ నిలబెట్టాలని సూచిస్తున్నారు. మరి మోడీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close