సొంత పార్టీలు పట్టించుకోని నేతలకు “గ్రేటర్” రోజులు..!

ఎన్నికలొస్తే చాలు … ఫేడవుట్ అయిన నేతల దగ్గర్నుంచి చోటా నేతల వరకూ అందరూ బిజీ అయిపోతారు. సొంత పార్టీ పట్టించుకోక.. సైలెంట్ గా ఉండిపోయిన వారంతా అసంతృప్తి వాదులవుతారు. వారికి మంచి రోజులు వస్తాయి. అదృష్టం బాగుంటే… ఇప్పటి వరకూ పట్టించుకోని సొంత పార్టీ నేతలు వచ్చి పలకరించిపోతారు.. ఒక వేళ ఆ అదృష్టం లేకపోతే.. .ఇతర పార్టీలు కండువాలు కప్పడానికి పోటీ పడుతూ ఉంటాయి. పార్టీల మధ్య పోటీ ఎక్కువగా గ్రేటర్ వంటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ఇది మరీ ఎక్కువగా ఉంది. చాలా కాలంగా సొంత పార్టీ పట్టించుకోని నేతల్ని చేర్చుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలతో… ఇతర పార్టీల్లో ఉన్నా లేనట్లే ఉన్న నేతలకు బంపర్ క్రేజ్ వచ్చి పడుతోంది.

నిన్నటికి నిన్న.. రెండేళ్ల క్రితం.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్లకు గురై.. ఖాళీగా ఉన్న సర్వే సత్యనారాయణను చేర్చుకోవడానికి బీజేపీ ఎక్కడా లేని ఉత్సాహం ప్రదర్శించింది. నేరుగా ముఖ్య నేతలు ఇంటికి వచ్చి పిలవడంతో సర్వే కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. పార్టీలో చేరిపోతానని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆ చాన్స్ స్వామిగౌడ్‌కు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా సకల జనుల సమ్మెను నడిపించిన ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి..శాసనమండలి చైర్మన్ చేశారు. పదవి కాలం అయిపోయిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇటీవల కులం కోణంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ పెద్దగా బజ్ రాలేదు. ఇప్పుడు.. బండి సంజయ్, లక్ష్మణ్ ఇంటికి వెళ్లి మరీ పిలవడంతో.. ఆయన హైలెట్ అయ్యారు. సర్వే, స్వామిగౌడ్ ఓ స్థాయి ఉన్న నేతలు. కింది స్థాయి వరకూ అనేక మంది నేతలకు ఇలాంటి మంచి రోజులే వచ్చాయి. వారి వారి స్థాయిలో హామీలు పొంది కండువాలు గుప్పించుకుంటున్నారు. రేపు ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ వారి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం కానీ ఇప్పటికైతే.. వారికో రోజు వచ్చినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : అన్నపై కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెడతారా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం గ్యాప్ తీసుకుని... "హిలేరియస్ టాపిక్‌"తో కొత్తపలుకులు వినిపించారు. అన్న జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విబేధిస్తున్న షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇంత వరకూ...

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

చంపడానికి కూడా సిద్ధమంటున్న ఉద్యోగ సంఘాల రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల "సామాజిక" భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా...

దీదీ కాన్సెప్ట్ : దేశానికి నాలుగు రాజధానులు..!

ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీని ప్రకారం మరి 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఎన్ని రాజధానులు...

HOT NEWS

[X] Close
[X] Close