ఆర్కే పలుకు : బీజేపీతో పెట్టుకోవద్దని కేసీఆర్‌కు సలహా..!

అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అందరూ చేయాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఇదే చేశారు. తన వారాంతపు ఆర్టికల్ కొత్త పలుకులో కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. బీజేపీతో పెట్టుకోవద్దని నేరుగానే సూచించారు. బీజేపీతో పెట్టుకుంటే ఏమవుతుందో.. చంద్రబాబును ఉదాహరణగా చూపించారు. కళ్ల ముందు చంద్రబాబు కనిపిస్తున్నా.. బీజేపీతో యుద్ధమని… ప్రాంతీయ పార్టీల కూటమి అని.. కేసీఆర్ హడావుడి చేయడం.. ఆయనకు ఎంత మాత్రం మంచిది కాదని సుతిమెత్తగానే సలహా ఇచ్చేశారు. దీనంతటికి కారణం… కేసీఆర్ కేంద్రంపై యుద్దానికి సిద్ధ్మవుతున్నానని ప్రకటించడమే. డిసెంబర్ రెండో వారంలో ప్రాంతీయ పార్టీల కూటమి నిర్వహిస్తానని ప్రకటించి.. కొంత మంది పేర్లను కూడా ప్రకటించారు. అందుకే… ఆర్కే స్పందించారు.

బీజేపీతో లడాయి పెట్టుకుని… మోడీకి వ్యతిరేకంగా దేశం మొత్తం తిరిగినచంద్రబాబు చివరికి దారుణంగా పరాజయం పాలయ్యారు. కానీ.. మోడీకి వ్యతిరేకం అవ్వాలనే ఆలోచన ఎవరిది..? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విస్తృతంగా ఉన్న ప్రచారం ప్రకారం.. అది ఆంధ్రజ్యోతి ఆర్కే సలహానే. ఏపీలో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. అది అధికార వ్యతిరేకతను అధిగమిస్తుందని సలహా ఇచ్చి.. కూటమి నుంచి బయటకు వచ్చేలా చేశారన్న అభిప్రాయం ఉంది. ఇది నిజమని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే.. అప్పట్లో ఆంధ్రజ్యోతి స్ట్రాటజీ ..అలాగే ఉంది. దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేకత పెరుగుతోందని… హంగ్ ఏర్పడితే చంద్రబాబు చక్రం తిప్పవచ్చని ప్లాన్లు వేసి.. చివరికి చంద్రబాబును ఎన్డీఏకు దూరం చేశారన్నది టీడీపీ నేతలు నమ్మే మాట.

చంద్రబాబును అధికాకారాననికి దూరం చేసిన నిర్ణయం.. మోడీని వ్యతిరేకించడం.. ఎన్డీఏకు దూరం అవడం. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. చంద్రబాబులా కేసీఆర్ ఎవరి సలహాలు తీసుకోరు. సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసే వాళ్లను దగ్గరకు కూడా రానివ్వరు. అయినప్పటికీ.. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే మొదటి సారి కాదు.. చాలా కాలంగా చెబుతున్నారు. అలా చెప్పినప్పుడు కూడా ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలే కొనసాగించారన్నది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మాత్రం… పరిస్థితి తేడాగా ఉంది. బీజేపీ ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతోంది. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ బీజేపీనే ప్రత్యర్థిగా మార్చుకోవాల్సిన పరిస్థితి.

చంద్రబాబు అనుభవంతో.. బీజేపీతో సఖ్యతగా ఉండమని..మోడీపై తిరగబడవద్దని ఆర్కే తన కొత్తపలుకు ద్వారా సలహా ఇచ్చారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన ఎందుకు అంచనా వేయలేకపోయారో తెలియదు. గతంలోలా సన్నిహితంగా ఉంటే… తెలంగాణలో బీజేపీని సైలెంట్‌గా ఉంచే పరిస్థితులు లేవు. సైలెంట్‌గా ఉండే.. మరిన్ని దెబ్బలు కొట్టడానికి బీజేపీ సిద్ధపడుతుంది. అది మరింత ప్రమాదకరం. అందుకే… బీజేపీతో పెట్టుకోవడం డేంజర్ అయినా.. కేసీఆర్‌కు మరో ఆప్షన్ లేదు. ఈ విషయం ఆర్కేకు తెలియక కాదు.. కానీ ఆయన మాత్రం.. బీజేపీతో పెట్టుకోవద్దన్న సలహాను మాత్రమే ఆర్కే పంపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close