జగన్ వెళ్లి అడిగినా…. ఆ ఫైల్‌ను వెనక్కి పంపేసిన గవర్నర్..!

విశ్వవిద్యాలయాల్లో.. తమకు ఇష్టం వచ్చిన వారిని వైస్ చాన్సలర్లుగా నియమించుకునే హక్కును దఖలు పర్చుకుంటూ.. ఏపీ సర్కార్ చేసిన బిల్లుపై సంతకం పెట్టేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ బిల్లును వెనక్కి పంపారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా… వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ పాత్ర ఉండేలా బిల్లును మార్చారు. సెర్చ్‌ కమిటీ అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో ఒక ప్యానెల్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ప్రభుత్వ సిఫార్సుపై సదరు ప్యానెల్‌ నుంచి ఒకరిని ఉపకులపతిగా కులపతి నియమించాలని సవరణ తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండదు. సెర్చ్‌ కమిటీ సూచించిన 3 పేపర్లలో నుంచి ఒకరిని చాన్సలర్ హోదాలో గవర్నరు నియమిస్తారు. కానీ అలాకాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు వైస్ చాన్సలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేసింది. దీనిపై కోర్టుల్లో పిటిషన్లు పడ్డాయి.

ప్రభుత్వం తాను చేసిన చట్టం ప్రాకరం.. శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను నియమించాలని ఫైల్‌ను గవర్నర్‌కు పంపింది. ఈ ఫైల్‌ను గవర్నర్ పెడింగ్‌లో పెట్టారు. జగన్ స్వయంగా వెళ్లి బిల్లును క్లియర్ చేయాలని అడిగినా చేయలేదు. న్యాయనిపుణుల సలహా అనంతరం వాటిని వెనక్కి పంపింది. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్… ఏపీ సర్కార్ నుంచి వస్తున్న బిల్లులు విషయంలో ఆచితూచి వ్యవహరించడం ప్రారంభించారు. నిన్నామొన్నటిదాకా ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే ఫైళ్లపై కాస్త అటూ ఇటూగా అయినా సంతకం చేసేవారు.

కాస్త ఆలస్యమైతే.. ప్రభుత్వం నుంచి బుగ్గననో.. మరో మంత్రో.. లేకపోతే సీఎంవో ఉన్నతాధికారులో వచ్చి ఒత్తిడి చేసి సంతకం చేయించుకునేవారు. ఎస్‌ఈసీ గా కనగరాజ్ నియామకం విషయంలో అదే జరిగింది. అయితే.. ఇప్పుడు.. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కోర్టుల్లో తేలిపోతూండటంతో… ఆయన సిన్సియర్‌గా న్యాయసలహాలు తీసుకుంటున్నట్లుగా వీసీల ఫైల్ వెనక్కి పంపడంతో తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close