మీడియా వాచ్ : తొలి ఆంధ్రా చానల్ మూసివేత..!

ఆంధ్రప్రదేశ్‌కు ఏదీ కలసి రావడం లేదు. రాజధాని పునాదుల్లోనే ఉండిపోయింది. శిథిలమైపోతోంది. మూడు రాజధానులు అంటూ.. ఎటు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే అవకాశం కనిపించడం లేదు. ఇంకా చాలా కాలం పాటు హైదరాబాదే కేంద్రంగా ఉండనుంది. నవ్యాంధ్ర తొలి తెలుగుచానల్‌గా ప్రారంభమైన ఏపీ 24/7 మూతబడింది. గత నాలుగైదు నెలలుగా ఉద్యోగులకు జీతాలివ్వడంలేదు. దాంతో వారు ధర్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో చానల్‌ను మూసేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది.

విజయవాడ కేంద్రంగా మొదలైన చానల్ కు మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు చైర్మన్. మరికొంత కూడా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో పరవాలేదనుకున్నట్లుగా నడిచింది. ఆంధ్రా ప్రజలు ఓన్ చేసుకునేంత స్టఫ్ లేకపోయినా.. విజయవాడ కేంద్రంగా మీడియా రంగం స్థిరపడటానికి ఓ బేస్ ఏర్పాటయిందని అనుకున్నారు. కానీ ఉద్యోగుల ఆధిపత్య పోరు మొదటికే మోసం తెచ్చింది. ఒక్కొక్కరుగా వైదొలగడం ప్రారంభించారు. చివరికి వెంకటకృష్ణ కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ చానల్‌ను తీసుకున్నారని.. మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో సీఈవో గా చేసిన సుధాకర్ ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది.

వ్యాపార పరంగా ఎదగాలంటే.. అన్ని రంగాలకు కేంద్రం అవ్వాలి. కనీసం.. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యాపారాలైనా అక్కడ్నుంచి సాగాలి. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రజలు.. చదువులు, ఉద్యోగాలు.. చివరికి వైద్య సేవల కోసం కూడా పొరుగు రాష్ట్రాలపై ఆదారపడే పరిస్థితి ఉంది. ఏపీ ప్రజలకు సమాచారం ఇచ్చే మీడియా కూడా హైదరాబాద్ గడ్డపైనే ఉండనుంది. ఇంకెంతకాలమో.. ఎవరూ చెప్పలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close