విజయసాయి చిచ్చు : విశాఖకు ఎయిర్‌పోర్టు ఉండకూడదా..!?

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రపంచ పటంలో పెడతామంటున్న వైసీపీ నేతలు ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్ పోర్టును మూసేయాలని కేంద్రానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అత్యంత రహస్యంగా ఉంచిన ఆ లేఖ.. కేంద్ర మంత్రి ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ విషయాన్ని విజయసాయిరెడ్డి సీక్రెట్‌గా ఉంచడం..అనూహ్యంగా వెలుగులోకి రావడంతో.. రాజకీయ దుమారం ప్రారంభమయింది. అసలు విశాఖ ఎయిర్ పోర్టుకు విజయసాయికి సంబంధం ఏమిటనే మౌలికమైన ప్రశ్నలు విశాఖ వాసుల నుంచి వస్తున్నాయి. అసలు విశాఖకు.. విజయసాయికి సంబందం ఏమిటని రాజకీయ పార్టీలు మండి పడుతున్నాయి. రాను రాను ఈ ఎయిర్‌పోర్టు అంశం.. సెంటిమెంట్‌గా మారుతోంది.

కేంద్రమంత్రి బయట పెట్టిన విజయసాయి “మూసివేత లేఖ”..!

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బయటకు చెప్పే దానికి అసలు చేసే దానికి చాలా తేడా ఉంటుంది. గత వారం .. కేంద్ర విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ పూరిని కలిశారు. బోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపానని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. కానీ.. విజయసాయి ఇలా చెప్పుకున్నాడని తెలియదో.. లేకపోతే.. రొటీన్‌గా తన రోజువారీ విశేషాలన్నీ సోషల్ మీడియాలో పెట్టడం అలవాటో కానీ.. మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. విజయసాయిరెడ్డి తనను కలిశాడని… విశాఖ ఎయిర్ పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయమని కోరారని.. సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. అంతే ఒక్క సారిగా గగ్గోలు రేగింది.

జీఎమ్మార్‌తో చీకటి ఒప్పందంలో మూసివేత భాగమా..!?

ప్రత్యేకంగా కేంద్ర విమానయాన మంత్రిని కలిసిన విజయసాయిరెడ్డి 30ఏళ్ల పాటు.. విశాఖ ఎయిర్ పోర్టును సివిల్ ఆపరేషన్స్ నుంచి దూరం చేయాలని కోరారు. అలా అయితేనే… దూరంగా కడుతున్న బోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంత వరకూ.. ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనే జరగలేదు. అప్పుడే.. విశాఖ ఎయిర్ పోర్టు మూత గురించి.. విజయసాయిరెడ్డి విజ్ఞాపనా పత్రాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని గత ప్రభుత్వం అనుకుంది. జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. అయితే అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపించింది. రాగానే కాంట్రాక్టును రద్దు చేసింది. కొద్ది రోజులు సైలెంట్‌గా ఉండి… జీఎంఆర్ కు కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని మళ్లీ ఆ సంస్థకే కాంట్రాక్ట్ అప్పగించింది. అయితే జీఎంఆర్‌కు ఇప్పుడు.. విశాఖ ఎయిర్ పోర్టు మూసేసి.. ఒక్క బోగాపురం మాత్రమే రన్ చేసేలా.. చూస్తామన్న హామీని ఏపీ సర్కార్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే… ఇలా లేఖ రాసారని భావిస్తున్నారు.

అసలు విజయసాయికేం సంబంధం..!?

విశాఖ ఎయిర్ పోర్టు ప్రజల సెంటిమెంట్. మెట్రోపాలిటన్ నగరంగా ఎదుగుతున్న విశాఖకు ఆ ఎయిర్‌పోర్టు ఓ బ్రాండ్‌గా ఉంది. ఒక్కో సౌకర్యాన్ని సమకూర్చుకుంటూ.,.ఎదుగుతోంది. దాన్ని ప్రజలు తమ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అలాంటి ఎయిర్‌పోర్టును మూసివేయాలని.. విజయసాయిరెడ్డి లేఖ రాయడం.. ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా కనిపిస్తోంది. సాధారణ ప్రజల్లోనూ విజయసాయి లేఖపై వ్యతిరేకత కనిపిస్తోంది. అసలు విశాఖ ఎయిర్‌పోర్టుపై అంత జబర్దస్తీగా లేఖ రాయడానికి విజయసాయి ఎవరన్న మౌలికమైన ప్రశ్న ప్రధానంగా వస్తూ ఉండటం.. కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close