గ్రేటర్‌లో ఎవరు పుంజుకుంటే వారే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం..!

హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ ప్రారంభించడంతో.. తెలంగాణ ఎస్‌ఈసీ కూడా జిహెచ్ఎంసి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకున్న కేటీఆర్ నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండొచ్చని, సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించి తొలి సారిగా బల్దియా పీఠం పై గులాబీ జెండా ఎగరేశారు. ఈ సారి పక్కా సెంచరీ కొడతామని చెబుతోంది. టీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పు ఊహాగానాల మధ్య కేటీఆర్ దక్షతకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. తిరుగులేని విజయం సాధిస్తే కేటీఆర్‌కు మార్గం సుగమం అయినట్లే.

కేసీఆర్ కూడా గ్రేటర్ పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదే పదే సర్వేలు చేయిస్తున్నారు. బీజేపీ పరిస్థితి కాస్త మెరుగైందని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కేసీఆర్ సర్వే విషయాన్ని పట్టించుకోకుండా.. బిజేపి కూడా స్పీడ్ ను పెంచుతోంది. పార్టీ నేతలు వార్డుల్లో బస్తీ భాటలో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆ పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగా గ్రేటర్ పరిధిలో నలుగురు పార్టీ అధ్యక్షులను నియమించారు. గత ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ గ్రేటర్ రేసు కోసం ఇంకా కసరత్తు ప్రారంభించ లేదు. గ్రేటర్ సీనియర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతల్లో సందడి కనిపించట్లేదు.

ఇక ఎంఐఎం రాజకీయం వేరు. టీఆర్ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం ఉంటుంది. ఎంఐఎంకు బలం ఉన్న స్థానాల్లో బలహీన అభ్యర్థులను నిలబెడతారు. ఆ పార్టీకి పాతబస్తీతో పాటు ముస్లిం ఓటర్లు మెజార్టీగా ఉన్న చోట్ల తిరుగు లేకుండా పోయింది. కాబట్టి… కనీసం నలభై డివిజన్లు ఆ పార్టీకి వస్తాయి. ఇక టీడీపీ పరిస్థితి ఉందా లేదా అన్నట్లుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో… టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని..బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు టీఆర్ఎస్‌కు పోటీ ఇస్తే వారే ప్రత్యామ్నాయం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close