కొత్త జీఎస్టీ రేషనలైజేషన్ (GST 2.0) ప్రకారం, సిమెంట్, స్టీల్, బ్రిక్స్ వంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ పై ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల అఫోర్డబుల్ హౌసింగ్ ధరలు 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది డెవలపర్లకు ఇన్పుట్ కాస్ట్‌లు తగ్గించి, ఆ సేవింగ్స్‌ను కస్టమర్లకు పాస్ ఆన్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది. ముఖ్యంగా సిమెంట్ పై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతం కు తగ్గడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్‌లు 3.5-4.5 శాతం తగ్గవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
పాత స్లాబ్స్‌ను తొలగించి, 5% మరియు 18% స్లాబ్స్‌కు మార్చారు. ఇది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు తగ్గించి, ఓవరాల్ బిల్డింగ్ కాస్ట్‌లు 3-5% తగ్గిస్తుంది. రూ.45 లక్షల లోపు ఇళ్లు పై జీఎస్టీ రేటు మారలేదు. కానీ ఇన్పుట్ మెటీరియల్స్ కాస్ట్ తగ్గడం వల్ల డెవలపర్లు ధరలు తగ్గించి, డిమాండ్ పెంచవచ్చు. ఇది ‘హౌసింగ్ ఫర్ ఆల్’ మిషన్‌ను సపోర్ట్ చేస్తుంది .
మొత్తం కన్స్ట్రక్షన్ కాస్ట్ 3-5% తగ్గితే రూ.40 లక్షల లోపు ధరలు అంతే మేర తగ్గవచ్చు. డెవలపర్ల మార్జిన్లు మెరుగుపడటం వల్ల ఫెస్టివ్ సీజన్లో డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సేవింగ్స్ పూర్తిగా కస్టమర్లకు పాస్ ఆన్ అవుతాయా అనేది డెవలపర్లపై ఆధారపడి ఉంటుంది. లగ్జరీ హౌసింగ్‌లో మాత్రం కొన్ని మెటీరియల్స్ పై రేట్లు పెరగవచ్చు.
ఇప్పటికే రెడీ అయిన ఇళ్లకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జీఎస్టీ కట్టేసి ఖర్చు పెట్టేసి నిర్మించేసి ఉంటారు బిల్డర్లు. కాని కొత్తగా నిర్మించే ఇళ్లలో మాత్రం డిస్కౌట్లు లభిస్తాయి. ఆ దిశగా కస్టమర్లు ప్రయత్నాలు చేయవచ్చు.