జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి వస్తున్న సమయంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి జీఎస్టీ ఉత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ తగ్గింపుల వల్ల నిత్యావసర వస్తువలు, రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. మధ్యతరరగతికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని మోదీ అన్నారు. కొత్త జీఎస్టీని విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
జీఎస్టీ సంస్కరణలు దేశాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో కూడా మోడీ తన స్పీడ్ లో వివరించారు. అదే సమయంలో ఆదాయపు పన్ను అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆదాయపన్ను పరిమితిని పన్నెండు లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతికి మరింత మిగులు చూపించామన్నారు. ఇరవై ఐదుకోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆత్మనిర్బర్ భారత్ ను మోదీ ప్రస్తావించారు. ఈ అంశాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తయారీ వస్తువులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.
ఆదాయపు పన్ను శ్లాబులను మార్చడం ద్వారా భారతీయులకు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయన్నారు. వన్ ట్యాక్స్.. వన్ నేషన్ అనే డ్రీమ్ జీఎస్టీని ద్వారా సాధ్యమయిందని సంతోషం వ్యక్తం చేశారు. మోదీ స్పీడ్ లో జీఎస్టీ మాత్రమే ఎజెండాగా ఉంది. ఇతర అంశాలను ప్రస్తావించలేదు. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి.. హెచ్ వన్ బీ వీసాల గురించి ఏం మాట్లాడలేదు.
