వైసీపీలో జగన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా మీద అందరూ జాలి పడుతున్నారు. అదే సమయంలో గూగుల్ సెంటర్ పై అదేపనిగా వ్యతిరేక ప్రచారం చేసిన గుడివాడ అమర్నాథ్ పైనా అందరి చూపు పడింది. ఆయన సొంత అభిప్రాయం మేరుకు డేటా సెంటర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఉండరు. ఖచ్చితంగా సజ్జల ఆఫీస్ నుంచి వచ్చిన సూచనల మేరకు.. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.
గూగుల్ డేటా సెంటర్ తో ఉద్యోగాలురావని, పొల్యూషన్ అని.. నీళ్లు వాడేస్తారు అని ఇలా రకరకాలుగా చెప్పారు. వాటన్నింటినీ జగన్ రెడ్డి తన ప్రెస్ మీట్ తో ఖండించేశారు. తనకు పార్టీ స్టాండ్ ప్రకారం ఓ రకంగా చెప్పి .. తనతో అలా మాట్లాడించి ఒక్క సారిగా జగన్ రెడ్డి.. తన పార్టీ స్టాండ్ వేరే అన్నట్లుగా చెప్పడం.. దాన్ని ఆహ్వానిస్తాం.. మంచిదే.. క్రెడిట్ మాక్కూడా కావాలని చెప్పడంతో గుడివాడ అమరనాథ్ ఇజ్జత్ పోయినట్లయింది. అసలే కోడిగుడ్డు మంత్రి అని విమర్శలు గుప్పిస్తూంటారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేశారు.
గుడివాడ అమర్నాథ్.. జగన్ రెడ్డి లాంటి క్లారిటీ లేని నాయకుడ్ని.. క్లారిటీ లేని విధానాలు ఉన్న పార్టీని నమ్ముకుంటే.. ఇలాగే బకరా అయిపోతూంటారు. అనవసరంగా ఆవేశపడి ఇప్పుడు అమర్నాథ్ తానే అటూ ఇటూ కాకుండా పోయారు. తాను మాట్లాడినవి పార్టీ తరపున కాదని.. వ్యక్తిగతంగా అని ఇపుడు చెప్పుకుని సర్దుకుంటారేమో చూడాల్సి ఉంది.
