స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో `శాకుంత‌లం` ఇంత భారీగా రూపుదిద్దుకొంది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాపై ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం భార‌తీయ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి అని దిల్ రాజు, గుణ‌శేఖ‌ర్‌లు ఘంటాప‌థంగా చెబుతున్నారు. ఈ సినిమాని 2డీలోనే విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. కానీ దిల్ రాజు ప్రోత్సాహంతో త్రీడీ వెర్ష‌న్‌లోకి మార్చారు. అందుకోసం ఆరు నెల‌లు శ్ర‌మించాల్సివ‌చ్చింది. త్రీడీ వ‌ల్ల బ‌డ్జెట్ కూడా భారీగా పెరిగింది. అయినా స‌రే, దిల్ రాజు వెనుకంజ వేయ‌లేదు. దిల్ రాజు పెట్టుబ‌డి పెడుతుంటే.. గుణ‌శేఖ‌ర్ సైతం షాకైపోయార‌ట‌. ”చాలా మంది తెలుగు సినిమాల గురించి పెద్ద‌గా తెలియ‌నివాళ్లు ఈ విజువ‌ల్స్ చూసి స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా.. ఇంత‌గా ఖ‌ర్చు పెట్టేశారు` అని న‌న్ను అడిగారు`” అంటూ శాకుంత‌లం ప్రెస్ మీట్ లో గుణ‌శేఖ‌ర్ వ్యాఖ్యానించారు. దీన్ని బ‌ట్టి చూస్తే… ఈ సినిమాపై అటు గుణ‌, ఇటు దిల్ రాజు ఎంత న‌మ్మ‌కం పెట్టుకొన్నారో అర్థ‌మైంది.

”త్రీడీలో సినిమా తీయాల‌న్న‌ది నా ఛాయిసే. ఇందుకోసం బ‌డ్జెట్ పెరుగుతుంద‌ని తెలుసు. కానీ కొన్ని షాట్స్‌ని త్రీడీలో చూశాక‌.. ఇలాంటి సినిమాని త్రీడీలోనే చూపించాల‌ని అనిపించింది. అందుకే ఖ‌ర్చు ఎక్కువైనా వెనుకంజ వేయ‌లేదు. ఈ సినిమాలో విజువ‌ల్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. అవ‌న్నీ త్రీడీలో చూస్తే బాగుంటుంది. ఈ వేస‌విలో ప్రేక్ష‌కులు కుటుంబ స‌మేతంగా థియేట‌ర్ల‌కు వ‌స్తారు. వాళ్ల‌లో పిల్ల‌లూ ఉంటారు. వాళ్ల‌ని ఆక‌ర్షించడానికే త్రీడీ య‌త్నం” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అన్న‌ట్టు ఈ సినిమా ర‌న్ టైమ్‌ని కూడా షార్ప్ గానే క‌ట్ చేశారు గుణ‌శేఖ‌ర్‌. 2 గంట‌ల 19 నిమిషాల్లోనే ఈ సినిమా ముగుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: టక్కర్

Takkar Movie Review తెలుగు360 రేటింగ్ : 2/5 సిద్ధార్థ్ ప్రతిభ గల నటుడు. ఆయనకి విజయాలు కూడా వచ్చాయి.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో చాలా క్రేజీ ని తెచ్చుకున్నాడు. ఐతే విజయాలని కొనసాగించడంలో...

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close