‘గుంటూరు కారం’ వేడుక వాయిదా

ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’పైనే అంద‌రి దృష్టీ ఉంది. మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ ల క్రేజీ కాంబో ఇది. ఈ పండ‌క్కి.. బాక్సాఫీసు రికార్డులు బ‌ద్దలు కొట్టే స‌త్తా కూడా ఈ సినిమాకే ఉంద‌ని అభిమానుల గ‌ట్టి న‌మ్మ‌కం. ఈ సినిమా నుంచి పాట‌లైతే వ‌దులుతున్నారు కానీ, ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ ఏం జ‌ర‌గ‌డం లేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనుమానంలో ప‌డింది. రేపు హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే… పోలీసులు ఆఖ‌రి నిమిషంలో ప‌ర్మిష‌న్లు వెన‌క్కి తీసుకోవ‌డంతో ఈవెంట్ వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త వేదిక చెబుతామ‌ని, డేట్ ఫైన‌ల్ చేస్తామ‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్క‌డ ఏర్పాట్లు కూడా మొద‌లెట్టారు. కానీ… అక్క‌డ పార్కింగ్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. పార్కింగ్ కోసం స‌మీపంలోని కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు చేసుకొంటే, ఈవెంట్ కి అనుమ‌తి ఇస్తామ‌ని పోలీసులు చెప్పారు. కానీ.. ఆ అనుమ‌తులు రాలేదు. దాంతో.. ఈవెంట్ ఆగిపోయింది. ఈసారి ఈవెంట్ ఎక్క‌డ చేస్తారు? అస‌లు ఈవెంట్ ఉంటుందా? లేదంటే నేరుగా ట్రైల‌ర్ వ‌దిలేస్తారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈనెల 12న సినిమా వ‌చ్చేస్తోంది. మ‌రో ఆరు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఇప్పుడు కొత్త వేదిక వెదికి, అక్క‌డ ఏర్పాట్లు షురూ చేయాలంటే కొంచెం క‌ష్ట‌మైన ప‌నే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close