నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వరంగల్ ఉపఎన్నిక ఫలితంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌‍ను ఓడించేందుకు తెలుగుదేశంతో సహా అన్ని ప్రతిపక్షాలతో పొత్తులు పెట్టుకుంటామని చెప్పారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ ఎంపీ చేసే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటంలేదు. అయితే అప్పటి పరిస్థితులెలా ఉంటాయో చెప్పలేము కాబట్టి పూర్తిగా కొట్టిపారేయలేముకూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదన్న బాలకృష్ణ, విమర్శించిన మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ లో 151 ఎమ్మెల్యే ల మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని, అంతకంటే ముందే ఈ ప్రభుత్వం దిగి పోతుందని నందమూరి బాలకృష్ణ...

బాలకృష్ణని ఎవరూ అవమానించలేదు: సి.కళ్యాణ్

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలి సినీ పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలు చేసిన...

ఇద్ద‌రు వ‌ర్మ‌ల్లో.. ఫ‌స్టు ఎవ‌రు?

క‌రోనాపై సినిమా తీసేశాన‌ని ప్ర‌క‌టించాడు రాంగోపాల్ వ‌ర్మ‌. ఆ సినిమా టీజ‌ర్‌కూడా విడుద‌ల చేసి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. వ‌ర్మ ప‌నుల‌న్నీ ఇలానే ఉంటాయి. గ‌ప్‌చుప్‌గా సినిమా లాగించేయ‌గ‌ల‌డు. ఈసారీ అదే ప‌ని...

నిర్మాత‌ల‌కు ఎన్టీఆర్ ఇచ్చే గౌర‌వం అదీ!

నిర్మాత అంటే ఈ రోజుల్లో క్యాషియ‌ర్ కంటే హీనం అయిపోయాడు. నిర్మాత అనే వాడు సెట్లో ఉండ‌డానికి వీల్లేదు అంటూ హీరోలు హుకూంలు జారీ చేసే రోజుల్లోకి వ‌చ్చేశామంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

[X] Close
[X] Close