సమైక్య రాష్ట్రం చేసేందుకు మళ్లీ చంద్రబాబు కుట్రట !

టీఆర్ఎస్ నేతలకు.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్లీ .. సమైక్య వాదుల కుట్రనడం ప్రారంభించేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏడాదిగా కేసీఆర్‌పై సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని.. పదవి నుంచి దించేయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలను కలిపి మళ్లీ సమైక్య రాష్ట్రంగా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని గుత్తా అంటున్నారు. కేసీఆర్‌‌ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు వారు మూకుమ్మడి దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని రాష్ట్రాన్ని మళ్ళీ కబ్జా చేయడానికి వస్తున్నారని అన్నారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్‌ ను అప్రతిష్ఠ పాలు చేస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర వారిదని మండలి చైర్మన్ చెప్పుకొచ్చారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే ముక్యమని ఆయన చెప్పుకొచ్చారు.

కానీ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అయిన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి దేశాన్ని ఉద్దరించడానికి కేసీఆర్ బయలుదేరారనే సంగతిని గుత్తా మర్చిపోయారన్నసెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏం జరిగినా సమైక్య వాదుల కుట్రలని.. రాజకీయం చేసుకోవడం.. అదే సమయంలో తాము దేశంలో సంచలనం సృష్టిస్తామని బయలుదేరడం .. దేనికీ పొంతన కుదరదని అంటున్నారు. టీఆర్ఎస్ మళ్లీ.. సెంటిమెంట్ రాజకీయాలేక మొగ్గుచూపుతోందని ఇటీవల ఆ పార్టీ నేతలు వరుసగా చేస్తున్న ప్రకటనతో అర్థమవుతోందన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close