జ‌మ్మూకాశ్మీర్లో లాగానే కొన్ని శ‌క్తులు ప్ర‌త్యేక హోదా అడుగుతున్నాయ‌ట‌!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు సాయంత్రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఈ సంద‌ర్భంగా విభ‌జ‌న హామీల అమ‌లుతోపాటు మ‌రోసారి ప్ర‌త్యేక హోదా అంశం కూడా మ‌రోసారి కేంద్రం ముందు ప్ర‌స్థావించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే, ఈ నేప‌థ్యంలో భాజ‌పా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు హోదాపై మ‌రోసారి కేంద్రం వాద‌న‌నే వినిపించారు. అంత‌వ‌ర‌కూ ఆగితే బాగుండేది, ఓ పోలిక తీసుకొచ్చి మ‌రీ హోదా అడుగుతున్న‌వారంతా అంతే అన్న‌ట్టుగా వ్యాఖ్యానించారు!

భాజ‌పా త‌ల్చుకుంటే క్ష‌ణాల్లో కాశ్మీరు అంశంపై నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా, ఏపీకి సంబంధించిన ప్ర‌త్యేక హోదాపైగానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంప‌కంపైగానీ ఎందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌నే మీడియా ప్ర‌శ్నకు జీవీఎల్ స‌మాధానం ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకునేదీ, చ‌ర్చించాల్సిందంటూ ఏమీ లేద‌న్నారు. అలాంటి ఒక వ్య‌వ‌స్థ అంటూ లేద‌ని చాలాచాలా స్ప‌ష్టంగా కేంద్రం ఇదివ‌ర‌కే చెప్పింద‌న్నారు. జమ్మూ కాశ్మీర్ మాదిరిగానే కొంత‌మంది శ‌క్తులు హోదా గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు!! వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే హోదాని వాడుకుంటున్నార‌ని అన్నారు. ఎవ‌రు ఏం చేసినా అది వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్నారు! సీట్ల పెంపు అంశం చ‌ట్టంలో ఉంది కాబ‌ట్టి, దానిపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అయితే, ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లంటూ లేవు కాబ‌ట్టి, కొంత స‌మ‌యం తీసుకున్నాక కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తుంద‌ని చెప్పారు.

హోదా ఇచ్చే అవ‌కాశం లేద‌ని భాజ‌పా చెబుతూనే ఉంది, అదేం కొత్త విష‌యం కాదు! కానీ, ఈ సంద‌ర్భంలో… జ‌మ్మూ కాశ్మీర్ మాదిరిగానే కొన్ని శ‌క్తులు హోదా అంశాన్ని రెచ్చగొడుతున్నాయ‌ని జీవీఎల్ అన‌డం… అసంద‌ర్భం! ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటులో ఇచ్చిన హామీ అది. అదేదో ఒక పార్టీకి చెందిన రాజ‌కీయాంశం కాదు. ఏపీలో గ‌త అధికార పార్టీ టీడీపీ ఆ హామీ అమ‌లు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది, ఇప్పుడు అధికారంలో ఉన్న వైకాపా కూడా అదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచుతూ వ‌స్తోంది. హోదా అనేది కేవ‌లం టీడీపీ డిమాండ్ గా మాత్ర‌మే ఉన్న‌ట్ట‌యితే, ఇప్పుడు అధికారంలో ఉన్న‌ వైకాపా దాని గురించి ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంది? ఇది ఏపీ ప్ర‌జ‌ల డిమాండ్. స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌నేది కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఇచ్చిన హామీ. అలాంట‌ప్పుడు, ఇదేదో కొన్ని శ‌క్తుల డిమాండ్ అంటూ జీవీఎల్ పోలిక తెస్తూ మాట్లాడ‌టం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బుగా ఉందో ఆయ‌న‌కే తెలియాలి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close