టీడీపీపై వ్యతిరేకతను జీవీఎల్ విద్వేషంగా మార్చుకుంటున్నారా..?

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ తరపున ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు తప్ప ఎవరూ కనిపించడం లేదు. చంద్రబాబు తుమ్మినా.. దగ్గినా… వెంటనే ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చేసి.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. దాని వెనుక అర్థాలు విడమర్చి చెప్పి.. దురర్థాలతో హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా తప్పేనన్నట్లుగా చెప్పుకు రావడం ప్రారంభించారు. పీడీ అకౌంట్ల దగ్గర్నుంచి చంద్రబాబు ప్రయాణ ఖర్చులు కూడా.. దుబారా చేస్తున్నారన్నట్లుగా.. కడపు మంటతో ఆవేశ పడిపోతున్నారు.

చంద్రబాబుపై వ్యతిరేకతను విద్వేషంగా మార్చుకుంటున్నారా..?

ఉత్తరప్రదేశ్ నుంచి జీవీఎల్ నరసింహారావు అనే వ్యక్తి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. బీజేపీ ఎమ్మెల్యేలు దండిగా ఉండటంతో.. అమిత్ షా పట్టుబట్టి ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించారని చెప్పుకున్నారు. అప్పుడే.. జీవీఎల్ నరసింహారావు అనే వ్యక్తి బీజేపీలో .. ఉన్నారని ఏపీలో తెలిసింది. అప్పటి వరకూ… ఈ జీవీఎల్‌కు… ఏపీ బీజేపీ నేతలతో కూడా పెద్దగా సంబంధాలు లేవు. కానీ యూపీ ఎంపీగా ఎన్నికయిన తర్వాత.. టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత ఆయన ఏపీపై పడ్డారు. చంద్రబాబును టార్గెట్ చేసుకుని.. ఏ మాత్రం… ఆధారాలు లేని… అభూతకల్పనలను మీడియా ముందు చెబుతూ.. చెలరేగిపోయారు. మొదట్లో.. మీడియా కూడా.. జీవీఎల్ మాటలను ఇంపార్టెన్స్ ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండి.. ఏదో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారన్న కారణంగా కావొచ్చు..! కానీ జీవీఎల్ మంత్రి లోకేష్ నుంచి చంద్రబాబు వ్యక్తిత్వాలను కించ పరిచే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ… ఒక్కటంటే.. ఒక్క ఆధారం కూడా బయపెట్టలేదు. లోకేష్ మనుషులు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు.. ఐరాస నుంచి ఆహ్వానం రాలేదన్నారు. కానీ…అన్నీ తప్పేనని తేలినా అడ్డగోలుగా సమర్థించుకున్నారు కానీ… సిగ్గుపడలేదు.

ఏపీ ప్రజలు అంత అమాయకులనుకుంటున్నారా..?

ఏపీకి లక్షల కోట్లు ఇచ్చామని.. ఆ సొమ్మంతా చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకంటున్నట్లు జీవీఎల్ ప్రచారం చేయాడనికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఏమిచ్చారనే విషయం అడిగితే.. రాష్ట్రం నుంచి వసూలు చేసే పన్నుల వాటాలు తప్ప… కొత్తగా ఏమిచ్చారో .. చెప్పడానికి ఆయన దగ్గర లెక్కల్లేవు. ఎన్ని టీవీ చర్చల్లో కూర్చున్నా.. అదే సమాధానం. మరి ఏపీకి ఏమిచ్చారు..? బీజేపీ… ఏపీని అత్యంత దారుణంగా వంచించిందనడానికి కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన జిల్లాకు ఇచ్చిన నిధులు బ్యాంకులో వేసి వెనక్కి తీసుకున్నారు. ఎందుకలా చేయాల్సి వచ్చిందో కేంద్రం ఇంత వరకూ చెప్పలేదు. యూపీల పేరుతో జీవీఎల్ హడావుడి చేస్తున్నారు. అదే నిజమైతే కేంద్రం ఎందుకు అధికారికంగా ప్రకటించదు..?. ఏపీకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. ప్రత్యేకహోదా ఇవ్వలేదు.. రైల్వేజోన్ ఇవ్వలేదు.. స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు… పోర్టు ఇవ్వలేదు… కేంద్ర విద్యాసంస్థలు నిధులు ఇవ్వడం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే .. చాట భారతం అవుతుంది. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. జీవీఎల్.. కేంద్రం ఏదో చేస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రజలు అమాయకులా..?

ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు..?

కొత్తగా జీవీఎల్.. ఏపీ ప్రభుత్వం తెగ ఖర్చు పెట్టేస్తోందని.. ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఏం ఖర్చు పెట్టారో కూడా వివరంగా చెప్పాల్సింది. తెలుగుదేశం పార్టీ.. పార్టీ తరుపున ధర్మ పోరాట దీక్షలుచేస్తోంది. ఈ దీక్షల్లో మోడీ బండారం బయట పెడుతున్నారని… జీవీఎల్‌కు కాలిపోతున్నట్లుగా ఉంది. ప్రభుత్వం తరపున ఖర్చు పెడుతున్నట్లు అడ్డగోలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందుదామనుకుంటున్నారు. అలాగే చంద్రబాబు… సేవ్ నేషన్ ఫ్రంట్ కోసం… ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నదాన్ని కూడా.. దుబారాగా భావిస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తూంటే.. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న పోరాటానికి జీవీఎల్ భయపడుతున్నట్లుగా ఉంది. అసలు జీవీఎల్ ఉత్తరప్రదేశ్ ఎంపీ. ఆయన మొత్తం ఏపీలోనే గడుపుతున్నారు. యూపీ ఎంపీ జీతాలు, అలవెన్స్‌లు తీసుకుంటూ… ప్రయాణ భత్యాలు అందుకుంటూ.. ఏపీలో రాజకీయం చేయడం.. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడం కాదా..? మొత్తంగా చూస్తే.. జీవీఎల్.. చంద్రబాబుపై వ్యతిరేకతను… విద్వేషం స్థాయికి పెంచుకుంటున్నారు. ఐటీ, ఈడీలను ఉసిగొల్పి ఏమీ చేయలేకపోయామనే.. దుగ్ధతో మరితంగా అధికార అహంకారంతో ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయ పడిపోతున్నారు. రాజకీయాల్లో అది ఎప్పటికీ… మెరుగైన స్థితికాదు. విచక్షణ కోల్పోతే… వెనక్కి తిరిగి చూసుకోవడానికికూడా ఏమీ మిగలదు.

———-సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూ ధర్మ పరిరక్షణే తిరుపతిలో టీడీపీ అస్త్రం..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.....

కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న...

“డీపీఆర్‌”ల కోసం సీఎంల వెంట పడుతున్న షెకావత్..!

పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.....

వ్యాక్సిన్‌పై నెగెటివ్‌ ప్రచారం కట్టడి ఎలా..?!

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి...

HOT NEWS

[X] Close
[X] Close