పత్రికల్లో వచ్చింది.. సీఎం రమేష్ మీసం తీయించుకోవాలి: జీవీఎల్

సీఎం రమేష్ ఐటీ దాడులు జరిగాయి. మూడు రోజుల పాటు ఆయన ఇళ్లు, వ్యాపార సంస్థలు, బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లతో పాటు.. చివరికి ఆరేళ్ల క్రితం ఖాళీ చేసిన బెంగళూరు, ఢిల్లీ కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. ఈ విషయాన్ని సీఎం రమేష్ బహిరంగంగానే ప్రకటించారు. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా పత్రాలను బయటపెట్టి… బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మదన్, ప్రవీణ్ కుమార్ కుమార్ అనే ఇద్దరు ఐటీ అధికారులు.. బీజేపీలో చేరమని బెదిరించారని కూడా మండిపడ్డారు. ఈ దాడులు ముగిసిన వారం రోజుల తర్వాత ఇంగ్లిష్ పత్రికల్లో.. సీఎం రమేష్‌కు చెందిన సంస్థల్లో రూ.వంద కోట్ల అనుమానాస్పద లావాదేవీలంటూ కథనాలు వచ్చాయి. ఐటీ అధికారులు చెప్పారనేది దానికి ట్యాగ్ లైన్. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా.. జీవీఎల్ వెంటనే… శుక్రవారం ఉదయం ఢిల్లీలో విజయవాడ ఫ్లైట్ పట్టుకుని వచ్చేశారు.

ఆ పత్రికల్లో కథనాలనే… సాక్ష్యాలుగా.. చూపించి… సీఎం రమేష్.. కన్నా దుర్మార్గుడు ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని తేల్చి చెప్పారు. మీసం మెలేసి చాలంజ్ చేశారు కాబట్టి మీసం గొరిగించుకుంటారా… అని కూడా ఆవేశ పడ్డారు. పత్రికల్లో రూ. వంద కోట్ల అక్రమ లావాదేవీలు అన్నట్లుగా వస్తే.. దాన్ని రూ. వంద కోట్ల పన్ను ఎగవేతగా మార్చుకున్నారు జీవీఎల్. చంద్రబాబు బినామీ అే దగ్గర్నుంచి… సీఎం రమేష్ తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారనేది.. వరకూ.. కోపం తగ్గే వరకూ.. నోరు నొప్పి పుట్టే వరకూ.. విమర్శలు చేశారు. తెలుగు దేశం పార్టీలో విలువలు లేవన్నారు. నిజానికి ఐటీ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఏపీలో ఐటీ దాడులు ఎవరెవరిపై చేయించాలన్నదాన్ని కూడా జీవీఎల్ మానిటర్ చేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.

అయినా.. సీఎం రమేష్ కంపెనీల్లో రూ. వంద కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగితే.. అధికారికంగా నోటీసులు పంపి.. చర్యలు తీసుకుంటే.. వచ్చే రాజకీయ మైలేజీ వేరుగా ఉంటుంది కదా..? వారంరోజుల తర్వాత పత్రికల్లో రాయించి.. వాటిని మించిన సాక్ష్యాల్లేవన్నట్లు బురదజల్లే ప్రయత్నం చేయడం ఎందుకన్న సందేహం టీడీపీ వర్గాల్లో ఉంది. జీవీఎల్ ప్రెస్‌మీట్‌లో కొత్తగా.. సత్యమూర్తి అనే.. ఓ బీజేపీ నేత కూడా ప్రత్యక్షమయ్యారు. ఆయన తన బంధువుల ఐటీ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు లంచం అడిగారని చెప్పుకొచ్చారు. ఏదైనా ఒక ఆధారం చూపించండి అని మీడియా అడగడమే తప్పయిపోయింది… ఏపీలో మీడియా సీఎం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని మండిపడి… ప్రెస్‌మీట్‌ను సర్దుకున్నారు. మొత్తానికి ఎవరు ఏమైనా అనుకోండి.. బురద చల్లితే చాలన్నట్లుగా ఉంది.. జీవీఎల్ అండ్ కో పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close