రమేష్, సుజనా ల మీద చర్యలు తీసుకోవాలని లేఖ రాసిన జివిఎల్ ఇప్పుడేమంటారో?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిలు మరో ఇద్దరు ఎంపీలతో పాటు కలిసి బిజెపిలో చేరి పోయారు. మొన్నటిదాకా విలువలు మాట్లాడిన బిజెపి నాయకులు దగ్గరుండి ఈ తంతు పూర్తి చేశారు. అయితే ఒక ఆరు నెలల కిందట బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయింది. ఆ లేఖను చూపిస్తూ జివిఎల్ నరసింహారావు గారు ఇప్పుడేమంటారు మరి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..

బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు 2018 డిసెంబర్ లో ఎథిక్స్ కమిటీకి ఒక లేఖ రాశారు. ఆ కమిటీ చైర్మన్ నారాయణ లాల్ పంచారియా ని సంబోధిస్తూ రాసిన ఆ లేఖలో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఐనటువంటి సిఎం రమేష్, సుజనా చౌదరిలు పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయని, సుజనా చౌదరి అయితే 5700 కోట్ల రూపాయలకు బ్యాంకు రుణాలు తీసుకొని బ్యాంకులని మోసం చేశారని ఆయన రాసుకొచ్చారు. వీరిద్దరు చేస్తున్న ఆర్థిక నేరాల కారణంగా రాజ్యసభ ప్రతిష్ట మసకబారుతోంది అని, వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని, తద్వారా రాజ్యసభ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించాలని జీవీఎల్ నరసింహారావు లేఖలో పేర్కొన్నారు.

కట్ చేస్తే, ఇప్పుడు అదే ఎంపీలు బిజెపిలో చేరి పోయారు. మరి ఇప్పుడు వీరిద్దరి కారణంగా, వీరు చేసిన ఆర్థిక నేరాల కారణంగా రాజ్యసభ ప్రతిష్ట మసకబారిన అంటూ నెటిజన్లు జివిఎల్ నరసింహారావు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా సుజనా చౌదరి మీద సీఎం రమేష్ ల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడి చేయడం, చేసిన ప్రతిసారి కొన్ని కీలకమైన డాక్యుమెంటు దొరికాయని ప్రకటనలు చేయడం తెలిసిందే. మరి వీరిద్దరూ బిజెపిలో చేరిన దరిమిలా ఇప్పుడు ఆ కీలక డాక్యుమెంట్లు కూడా చెత్తబుట్టలోకి వెళ్తాయేమో అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఎథిక్స్ కమిటీకి, అంత పెద్ద లేఖ రాసి, ఇప్పుడు అదే ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకుని తమ ఎథిక్స్ ఏపాటివో బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారని, మరి ఇప్పుడు ఈ సంఘటనపై జివిఎల్ ఎలా స్పందిస్తారో చూడాలని నెటిజన్లు, ప్రజలు కుతూహలంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close