వెంకయ్య ఏమీ చేయలేకపోయారు..! వాళ్లు బీజేపీ సభ్యులైపోయారు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు… బీజేపీలోకి ఫిరాయించారు. అచ్చం తెలంగాణలోలా.. ఎలాంటి ఎల్పీ మీటింగ్‌లు లేకపోయినా.. మీటింగ్‌లు పెట్టేసుకున్నట్లుగా లేఖ రాసి.. బీజేపీలో కలిసిపోయారు. అయితే.. తెలంగాణలోలా మండలి చైర్మన్, శాససభ స్పీకర్లు ఉంటే.. పెద్ద మ్యాటర్ అయ్యేది కాదేమో.. ! కానీ అక్కడ అంతకు ముందు … పార్టీ ఫిరాయించిన వెంటనే పదవులు పోవాలని నీతులు చెప్పిన.. గతంలో నాన్ బీజేపీ … ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై వేటు వేసి.. వెంకయ్య… అక్కడ ఉన్నారు కాబట్టి.. . ఆదర్శాలను పాటిస్తారేమో అనుకున్నారు. కానీ.. అక్కడ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

బీజేపీ జాబితాలో ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు…!

తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని… బీజేపీ.. తన ఖాతాలో వేసేసుకుంది. ఆ నలుగురు బీజేపీ సభ్యులని.. అధికారికంగా.. రాజ్యసభ వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ ఆ లాంఛనాలను పూర్తి చేయకపోతే.. అది జరిగి ఉండేది కాదు. కనీసం.. ఆ ఎంపీల అసలైన పార్టీ నుంచి వచ్చే.. పిటిషన్లు కానీ.. ఇతర విజ్ఞప్తులను కూడా.. తీసుకునేంత తీరిక లేకుండా… ఈ క్రతువును.. వెంకయ్య పూర్తి చేసేశారు. దీంతో ఆయన కూడా.. మాటలు చెప్పే రాజకీయ నేతల కేటగిరీలో చేరిపోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అని… నిబంధనల ప్రకారమే చేశామని.. ఎంత చెప్పుకున్నా.. సామాన్య ప్రజల‌లో మాత్రం అది అనైతికంగానే ముద్రపడిపోయింది.

వెంకయ్యను పక్కన పెట్టేసి లాంఛనాలు పూర్తి చేసిన బీజేపీ పెద్దలు.. !

వెంకయ్యను నామమాత్రం చేసి.. ఇతర బీజేపీ నేతలు.. ఈ కథ నడిపించారన్న అభిప్రాయం.. ఢిల్లీలో వినిపిస్తోంది. దీనికి నిన్నటి నుంచి ఢిల్లీలో జరిగిన పరిణామాలే సాక్ష్యం అంటున్నారు. నిన్న మొదటగా.. నలుగురు టీడీపీ రాజ్యసభసభ్యులు.. వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్లారు. ఏమయిందో ఏమో కానీ..ఎలాంటి లేఖ ఇవ్వకుండా వచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాతో కలిసి వెళ్లారు. అప్పుడు… బీజేపీ తరపున విలీనానికి ఆమోదముద్ర వేసే లేఖతోపాటు.. ఎంపీల లేక ఇచ్చారు. అప్పుడు మాత్రం వెంకయ్యనాయుడు.. వాటిని తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా.. మిగతా లాంఛనాలు వెంకయ్యకు సంబంధం లేకుండా జరిగిపోయాయన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు టీడీపీ నేతల్నుంచి ఫిర్యాదు తీసుకుని ఏం చేస్తారు..?

ఆ నలుగురు ఎంపీలు బీజేపీ ఖాతాలో చేరిపోయినట్లుగా.. వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన తర్వాత వెంకయ్యనాయుడు… టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలకు.. సమయం ఇచ్చారు. అప్పుడు వారు.. ఆ నలుగురు ఎంపీలపై.. అనర్హతా వేటు వేయాలని.. ఓ వినతిపత్రం మాత్రం ఇవ్వగలిగారు. వెంకయ్యనాయుడు.. అంతా అయిపోయింది.. తానేం చేయలేనని.. చేతులెత్తయలేదు కానీ… వినతి పత్రంలో ఫోటోలకు మాత్రం… స్టిల్స్ ఇచ్చారు. టీడీపీ ఫిర్యాదులతో ఇప్పుడు.. వెంకయ్య కూడా చేయగలిగిందేమీ లేదు. ముందు.. ముందు… ఇదే రాజ్యసభ చైర్మన్ ఇంకెన్ని విలీనాలకు సాక్షిగా నిలుస్తారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close