వైసీపీ ప్రభుత్వం నిర్యీర్యం చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి హ్యాపీనెస్ట్. ఓ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న 1200 ప్లాట్లు గంటలో తమ్ముడు కావడం ఓ చరిత్ర. అలాంటి రికార్డు ఉన్న హ్యాపీనెస్ట్ ను పదేళ్ల పాటు నిర్వీర్యం చేసి.. కొనుగోలుదారులకు భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వెంటనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌గా 14.46 ఎకరాల్లో 12 టవర్లు (G+19 ఫ్లోర్లు) నిర్మిస్తున్నారు. ఇక్కడ 1,200 2 & 3 BHK అపార్ట్మెంట్లు ఉంటాయి, మొత్తం ఖర్చు రూ.930 కోట్లు. NCC కంపెనీ కాంట్రాక్టర్‌గా పని చేస్తోంది. సెప్టెంబర్ 2025 నాటికి, ప్రాజెక్ట్ పునఃప్రారంభమై ప్రస్తుతం ఫౌండేషన్ వర్క్ పూర్తవుతోంది. పని వేగంగా జరుగుతోందని ఇంజనీర్లు మానిటరింగ్ చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రయత్నిస్తోంది.
హ్యాపీ నెస్ట్ .. రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు. సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కొనుగోలు దారులు రెరాను ఆశ్రయించారు. విచారణ జరిపిన రెరా కొనుగోలుదారులకు 16.2%వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఫ్లాట్లను స్వాధీన పరిచేంత వరకూ ఈ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఎంతో కొంత ఇస్తాం.. ప్లాట్లు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం కొనుగోలుదారులను బెదిరించింది.
నలుగురు, ఐదుగురు తప్ప ఎక్కువ మంది రద్దు చేసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో హ్యాపీ నెస్ట్ ను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఐదేళ్లలో నిర్మాణ విలువ రెండు వందల కోట్ల మేర పెరిగింది. అయినా సరే పాత ధరలకే ప్లాట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హ్యాపీనెస్ట్ బుకింగ్ చేసుకున్న వారికి ఫ్లాట్లు చేతికొచ్చే అవకాశం ఉంది.