జగన్‌ను కలవలేదన్న హరీష్‌: ఆధారాలు బయటపెడతామన్న అచ్చెన్నాయుడు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ నీటిపారుదలశాఖమంత్రి హరీష్‌రావుతో కలిసి ఓటుకు నోటు కేసుకు కుట్టచేశారంటూ ఏపీ అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. జగన్మోహనరెడ్డిని తన జీవితంలో ఎన్నడూ కలవలేదని హరీష్‌రావు చెప్పారు. ఒకవేళ జగన్‌ను కలిసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని, లేకపోతే మీరు సిద్ధమా అంటూ చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఆ చరిత్ర చంద్రబాబుకే ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పీకలదాకా కూరుకుపోయిన చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

మరోవైపు హరీష్ రావు, జగన్, స్టీఫెన్సన్ మే 21న హోటల్‌లో కలుసుకున్నది వాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి చెప్పారు. హోటల్ సీసీ ఫుటేజిని తొలగింపజేశారని ఆరోపించారు. ఆ ముగ్గురూ కలుసుకున్నట్లు తమదగ్గర ఆధారాలున్నాయని మంత్రి ఇవాళ అసెంబ్లీలో మరోసారి చెప్పారు.

హరీష్-జగన్ భేటీపై ఆధారాలు బయటపెడతామని టీడీపీవారు దాదాపు రెండునెలలనుంచి చెబుతున్నారుగానీ, ఎందుకనో బయటపెట్టటంలేదు. ఆధారాలు ఉంటే అవి బయటపెట్టేస్తే ఒకపనయిపోతుందికదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ...

బ్యారేజీలో బోట్లు తీయడం పెద్ద టాస్కే !

ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు....

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close