ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. న్యాయస్థానాల గౌరవాన్ని నిలబెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హరీష్ సాల్వే నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. న్యాయవ్యవస్థను తిట్టడం.. బెదిరించడం.. సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం.. వంటి అంశాలను హరీష్ సాల్వే ప్రస్తావించారు.

సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థకు భంగం వాటిల్లుతున్న వైనంగా జరిగిన ఓ సమావేశంలో చేసిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిణామాలను ఆయన చాలా ప్రమాదకరంగా అభివర్ణించారు. రాజకీయపార్టీ నాయకులు నేరుగా న్యాయమూర్తులను దూషిస్తూ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని .. అలా చేయడం వల్ల.. వ్యవస్థలకు ఎక్కడ గౌరవం దక్కుతుందని ప్రశ్నించారు. హరీష్ సాల్వే అభిప్రాయాలు.. విస్తృత చర్చకు కారణం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఏపీలో న్యాయవ్యవస్థపై ఓ రకమైన దాడి జరుగుతోందన్న అభిప్రాయం ఉన్నత స్థాయిలో ఏర్పడిన నేపధ్యంలో సాల్వే వ్యాఖ్యలు చర్చకు కారణం అవుతున్నాయి.

హరీష్ సాల్వే దేశంలోని అత్యంత సీనియర్ న్యాయ, రాజ్యాంగ నిపుణుల్లో ఒకరు. గతంలో సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. అంతర్జాతీయ కోర్టులో కులభూషణ్ జాదవ్ తరపున వాదించి గెలిపించి తీసుకు వచ్చిన న్యాయవాది కూడా హరీష్ సాల్వేనే. దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా సాల్వేకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో క్వీన్స్ కౌన్సిల్‌గా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

HOT NEWS

[X] Close
[X] Close