బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని… నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు. ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పులే కార‌ణం. కొద్దిమంది ర‌చ‌యిత‌లు కూడా అంతే. ఒక‌ప్పుడు స్టార్ రైట‌ర్‌గా వెలిగాడు చిన్నికృష్ణ‌. సమ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు, ఇంద్ర‌, న‌ర‌సింహ‌… త‌దిత‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కి క‌థ‌ల్ని అందించారు చిన్నికృష్ణ‌. అయితే ఆ మేజిక్‌ని అట్టే కొన‌సాగించ‌లేక‌పోయారు. `గంగోత్రి` త‌ర్వాత ఆయ‌న్నుంచి చెప్పుకోద‌గ్గ క‌థ మ‌రొక‌టి రాలేదు. ఇప్పుడు ఎలాగైనా మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌నేది ఆయ‌న ప్ర‌య‌త్నం. అందుకోసం ఒక శ‌క్తివంత‌మైన క‌థ‌ని సిద్ధం చేశాడు. అది కూడా బాల‌కృష్ణ కోసం. బాల‌కృష్ణ – చిన్ని కృష్ణల‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేషన్ అన్న విష‌యం తెలిసిందే. తాను మ‌ళ్లీ స‌క్సెస్ అందుకోవ‌డానికి బాల‌కృష్ణ అయితేనే బెట్ట‌ర్ అని భావించి చిన్నికృష్ణ క‌థ‌ని సిద్ధం చేశార‌ట‌. మరి ఆ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌న్న‌దే స‌స్పెన్స్‌. నిజానికి చిన్నికృష్ణ క‌థ‌ల్ని ఎక్కువ‌గా బి.గోపాల్ తెర‌కెక్కిస్తుంటారు. మ‌రి ఈసారి కూడా ఈ కాంబినేష‌నే సెట్ కాబోతోందా అన్న‌ది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

HOT NEWS

[X] Close
[X] Close