జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ పాట‌లు బాగా ఉప‌యోగ‌పడ‌టంతో పాటు… మ‌రోసారి కొత్త‌గా వినిపించ‌డం, కొత్త‌గా వాటిలో ఆడిపాడ‌టం అనేది ఫ్యాన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తించే విష‌యం. అందుకే విరివిగా రీమిక్స్ అవుతుంటాయి. చిరంజీవి సినిమాలోని పాట‌లు సాయిధ‌‌ర‌మ్ తేజ్ సినిమాల్లో ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. రామ్‌చ‌ర‌ణ్ కూడా ఆ పాట‌ల్ని బాగా వాడాడు. కృష్ణ సినిమాల్లోని పాట‌లు మ‌హేష్‌, సుధీర్‌బాబు సినిమాల్లో వినిపించాయి. తాజాగా మ‌రోసారి కృష్ణ సూప‌ర్‌హిట్ పాట `జుంబారే…. `ని ఆయ‌న మ‌న‌వ‌డు గ‌ల్లా అశోక్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. గల్లా అశోక్ క‌థానాయ‌కుడిగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణ త‌న‌య గ‌ల్లా ప‌ద్మావ‌తి త‌న‌యుడే గ‌ల్లా అశోక్‌. తాత పాట‌ని మ‌న‌వ‌డు వాడేశాడ‌న్న‌మాట‌. అశోక్ తొలి చిత్రం గ్రాండ్‌గా తెర‌కెక్కుతోంది. సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. జుంబారే పాట‌లో అశోక్‌, నిధి క‌లిసి చేస్తున్న హంగామా, ఆ గ్రాండ్‌నెస్ ఆక‌ట్టుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

రాహుల్‌పై దౌర్జన్యం..! ప్రతిపక్ష నేతలకు కనీస స్వేచ్ఛ కూడా లేదా..?

కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో.... ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు...

ఏడున్న‌ర ఎక‌రాల్లో అల్లు స్టూడియోస్‌

తెలుగు చిత్ర‌సీమ‌కు స్టూడియోల కొద‌వ లేదు. అన్న‌పూర్ణ, రామానాయుడు, ప‌ద్మాల‌యా, సార‌ధి.. ఇలా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే నాలుగు స్టూడియోలున్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు స‌గం షూటింగులు...

టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా రాజీనామా..! అసంతృప్తేనా..?

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత...

HOT NEWS

[X] Close
[X] Close