గ్లాసులో ఐస్ ముక్క‌లేశావా… హ‌రీష్ పంచ్ అదిరింది

ఎప్పుడూ చీప్ గా ‘గాసిప్పు’ వార్త‌లు రాసి, దానిపైనే ఆధార‌ప‌డే ఓ వెబ్ సైట్‌కి గ‌ట్టిగా చుర‌క‌లు అంటించాడు హ‌రీష్ శంక‌ర్‌. ‘ఈగిల్’ స‌క్సెస్ మీట్ ఇందుకు వేదిక అయ్యింది. ‘ఈగిల్’ సినిమాకి అత్యంత దారుణ‌మైన రేటింగు ఇచ్చి, ద‌ర్శ‌కుడ్ని టార్గెట్ చేస్తూ ఇచ్చిన రివ్యూపై అప్ప‌టిక‌ప్పుడే సోష‌ల్ మీడియా ద్వారా సెటైర్ వేశాడు హ‌రీష్ శంక‌ర్‌. అయినా త‌న ఆవేశం చ‌ల్లార‌లేదేమో..? ఇప్పుడు మ‌రోసారి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఈ సినిమాలో ల‌వ్ ట్రాక్ వీక్ గా ఉంద‌ని ఓ రివ్యూలో చ‌దివాన‌ని, ఈ సినిమా టైటిల్ ప్రేమ పావురాలు కాద‌ని, యాక్ష‌న్ సినిమాని ఇలానే తీస్తార‌ని, ల‌వ్ స్టోరీ కోసం కాద‌ని – స‌దరు వెబ్ సైట్ పై సెటైర్ వేశాడు. గ‌తంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్`లో రొమాన్స్ త‌గ్గింద‌ని ఈ వెబ్ సైటే రాసింద‌ని గుర్తు చేశాడు హ‌రీష్‌.

త‌న‌పై కూడా ఆ గ్రేట్ గాసిప్ వెబ్ సైట్ గ‌తంలో ఓ క‌థ‌నం రాసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఓ సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు, నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ద‌ర్శ‌కుడు.. ఓ ప్రొడ్యూస‌ర్ ఇంట్లో రాత్రంతా తాగుతూ కూర్చున్నాడ‌న్న‌ది ఆ వార్త. దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు హ‌రీష్‌. ‘ప‌వ‌న్‌తో ఓ సూప‌ర్ హిట్ తీసి, నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న‌వాడ్ని నేనే. ధైర్యం ఉంటే నా పేరు రాయాలి. నా ఫొటో పెట్టాలి. అప్పుడు నేను స్పందించి ఉండేవాడ్ని. నేను మందు తాగితే గ్లాసులో ఐస్ ముక్క‌లు నువ్వేశావా, నా పెగ్గు నువ్వు క‌లిపావా’ అంటూ గ‌ట్టిగా అందుకొన్నాడు హ‌రీష్. సినిమా ఇండ‌స్ట్రీ అంటే జ‌ర్న‌లిస్టులు కూడా అని, అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని, ప‌ర్స‌న‌ల్ ఎజెండా ఇక్క‌డ అవ‌స‌రం లేద‌ని గుర్తు చేశాడు. నా త‌రువాతి సినిమాపై క‌క్ష క‌ట్టినా ఫ‌ర్వాలేదు. అది నాకు వెంట్రుక‌తో స‌మానం’ అంటూ జ‌గ‌న్‌కి గుర్తు చేస్తూ, ఇది ఆయ‌న‌కు స‌పోర్ట్ గా ప‌నిచేసే వెబ్ సైట్ కు చెబుతున్నా అంటూ ప‌రోక్షంగానే ఫైర్ అయ్యాడు. నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ కూడా స‌ద‌రు వెబ్ సైట్ కి వార్నింగ్ ఇచ్చారు. ‘నా సినిమా ప్ర‌మోష‌న్ కి ఓ వెబ్ సైట్ బాగా ప‌ని చేసింది. నిర్మాత‌లంద‌రితోనూ మాట్లాడి క్రెడిట్స్ వెళ్లేలా చేస్తా’ అంటూ ఆయ‌న కూడా సెటైర్ వేశారు.

https://x.com/telugu360/status/1756694951704822183?s=46&t=eI9gtX25WpQZw-YusmSFVA

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ తిట్టి జగన్‌ను ఇంప్రెస్ చేయండి – టిక్కెట్ పట్టండి !

వైసీపీలో ఇప్పుడు ఓ రకమైన రాజకీయం నడుస్తోంది. టీడీపీ జనసేన పొత్తుతో రాజకీయంపై స్పష్టత రావడంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. అయితే ఇంకా టిక్కెట్ పై ఆశలు పెట్టుకుని.. జ...

టీడీపీ అభ్యర్థుల మినిమం విద్యార్హత డిగ్రీ !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితాలో అందరి విద్యార్హత మినిమం డిగ్రీ ఉంది. ఒక్కరు కూడా అంత కంటే తక్కువ చదువుకున్నవారు లేరు. వీరిలో 30 మంది...
video

‘భీమా’ ట్రైలర్ టాక్ : బ్రహ్మ రాక్షసుడు

https://www.youtube.com/watch?v=P3t--CmbibE మార్చిలో వస్తున్న సినిమాల్లో గోపీచంద్‌ 'భీమా' ఒకటి. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ అంతా యాక్షన్, ఎలివేషన్స్ తో నిండిపోయింది. ట్రైలర్ లో...

జనసేనను రెచ్చగొట్టే ప్లాన్ ఫెయిలయిందని వైసీపీ గగ్గోలు !

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close