‘భామా క‌లాపం’ … ఇదోర‌కం భార‌తం

‘ఆహా’లో వ‌చ్చిన ‘భామాక‌లాపం’ డీసెంట్ హిట్ గా నిలిచింది. అప్ప‌ట్లోనే నాలుగు మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఓ సాధార‌ణ గృహిణి అత్యుత్యాహం ఎన్ని ర‌కాల ఇబ్బందుల‌కు గురి చేసిందో.. స‌ర‌దాగా, ఆస‌క్తిక‌రమైన మ‌లుపుల‌తో చెప్పిన వెబ్ మూవీ అది. ఇప్పుడు ‘భామా క‌లాపం 2’ కూడా సిద్ధ‌మైంది. ఈనెల 16 నుంచి ‘ఆహా’లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రియ‌మ‌ణి, సీర‌త్ క‌పూర్‌, శ‌ర‌ణ్య, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ట్రైల‌ర్ ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచింది.

అనుప‌మ (ప్రియ‌మ‌ణి) పాత్ర‌ని ఈ సీక్వెల్ లో మ‌రింత క్రేజీగా తీర్చిదిద్దిన‌ట్టు అర్థం అవుతోంది. తొలి భాగం హిట్ట‌వ్వ‌డంతో సీక్వెల్ స్పాన్ కూడా పెంచారు. మేకింగ్ లో క్వాలిటీ క‌నిపించింది. ఈ క‌థ‌లో క్రైమ్ ఎలిమెంట్స్ చాలానే చోటు చేసుకొన్నాయి. ప్రియ‌మ‌ణి, శ‌ర‌ణ్య ఓ దోపిడీకి పూనుకోవ‌డం, అందుకోసం స్కెచ్ వేయ‌డం ఇవ‌న్నీ ఆస‌క్తి క‌లిగించాయి. ఓ సాధార‌ణ గృహిణి, ఓ అసాధార‌ణ దోపిడీకి ఎందుకు పూనుకొంది? అనేది ఓ స‌స్పెన్స్ ఎలిమెంట్‌. ”70 ఎం.ఎంలో మ‌హా భార‌తం చూపించావే.. క్యారెక్ట‌రే కాస్త క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉంది. నువ్వు స‌త్య‌వ‌తివా, కుంతివా, లేక శిఖండివా” అని అడిగితే.. ”ఒక మామూలు హౌస్ వైఫే సార్‌..” అంటూ ప్రియ‌మ‌ణి అమాయ‌కంగా చెప్ప‌డం ఈ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకొనే మ‌రో అంశం. ప్రియ‌మ‌ణి ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు సాధించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆ విష‌యాన్ని ఈ ట్రైల‌ర్‌లో మ‌రోసారి గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు ఓ చిన్న డైలాగ్ తో. మొత్తంగా చూడాల‌నిపించే ఆస‌క్తికి క‌లిగించ‌డంలో.. ట్రైల‌ర్ పాస్ అయిపోయింది. ఇక ప్రేక్ష‌కుల తీర్పే మిగిలి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close