చిరు బ‌యోపిక్‌పై హ‌రీష్ శంక‌ర్ ఫోక‌స్‌

ఎన్టీఆర్ క‌థ‌ని బ‌యోపిక్‌గా తీస్తున్న‌ప్పుడు చిరంజీవి క‌థ బ‌యోపిక్‌గా వ‌స్తే బాగుంటుంద‌ని మెగా ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆ ఆలోచ‌న‌లు ప‌క్క‌కు వెళ్లిపోయాయి. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్ బ‌యోపిక్ టాపిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. `వాల్మీకి` ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్‌కి `చిరంజీవి బ‌యోపిక్` ప్ర‌శ్న ఎదురైంది. దానికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పాడు వ‌రుణ్‌.

హ‌రీష్ శంక‌ర్‌కి చిరంజీవి బ‌యోపిక్ చేయాల‌న్న ఆలోచ‌న ఉంద‌ని, రాజ్‌కపూర్ క‌థ‌నీ ఆయ‌న తెర‌కెక్కించాల‌నుకుంటున్నార‌ని చెప్పాడు వ‌రుణ్‌. “పెద‌నాన్న‌కు హ‌రీష్‌శంక‌ర్ పెద్ద ఫ్యాన్‌. అందుకే ఆయ‌న బ‌యోపిక్ చేయాల‌నుకుంటున్నాడు. మేం స‌ర‌దాగా క‌ల‌సి మాట్లాడుకుంటున్న‌ప్పుడు చాలా టాపిక్కులు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అలాంటి ఓ సంద‌ర్భంలో చిరంజీవి గారి బ‌యోపిక్ తీయాల‌ని వుంద‌ని హ‌రీష్ చెప్పాడు. అది చ‌ర‌ణ్ అన్న‌య్య చేస్తే బాగుంటుంది.చ‌ర‌ణ్ కాదంటే… నేను చేస్తా“ అన్నాడు వ‌రుణ్‌. సో.. చిరు బ‌యోపిక్ పై ఇంకా న‌మ్మ‌కాలు ఉంచుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెన్షన్ పెట్టిన ఈడీ – కవితకు మళ్లీ రిలీఫ్ !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి పంపించారు. ఉదయం పదిన్నర సమయంలో ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవితను పొద్దుపోయే వరకూ సుదీర్గంగా...

కృష్ణ‌వంశీకి హ్యాండిచ్చిన ప్ర‌కాష్ రాజ్‌

డూ ఆర్ డై ప‌రిస్థితుల్లో కృష్ణ‌వంశీ తీసిన సినిమా రంగ‌మార్తాండ‌. ఈ సినిమా అనుకొన్న‌ప్ప‌టి నుంచీ క‌ష్టాలే. అనుకొన్న బ‌డ్జెట్‌లో, అనుకొన్న స‌మ‌యానికి సినిమా పూర్తి కాలేదు. నిర్మాత‌లు మారారు. రిలీజ్ డేట్...

త్రివిక్ర‌మ్ + లోకేష్ క‌న‌క‌రాజ్ = విశ్వ‌క్‌సేన్‌

విశ్వ‌క్‌సేన్‌కి క‌థానాయిక నివేదా పేత‌రాజ్ ఓ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. విశ్వ‌క్‌లో అటు త్రివిక్ర‌మ్‌, ఇటు లోకేష్ క‌న‌క‌రాజ్ ఉన్నార‌ని తెగ పొగిడేసింది. విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'దాస్...

వివేకా కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

దారుణమైన హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ఆరోపణలు చేస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారిని మార్చే విషయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close