సైరా.. 3 నిమిషాల ట్రైల‌ర్‌

మ‌రి కొద్ది గంట‌ల్లో `సైరా` ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. ఈ ట్రైల‌ర్ ఎలా ఉంటుందా? అని మెగా అభిమానుల‌తో పాటు టాలీవుడ్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ట్రైల‌ర్‌ని బ‌ట్టి సినిమా స్టామినా ఎంతో తేలిపోనుంది. అయితే.. ట్రైల‌ర్ విష‌యంలో చిత్ర‌బృందం చాలా జాగ్ర‌త్త వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. సినిమాలో కీల‌క‌మైన ఎపిసోడ్ల‌ని ఈ ట్రైల‌ర్‌తో ప‌రిచ‌యం చేయ‌బోతోంద‌ని స‌మాచారం. ట్రైల‌ర్ నిడివి దాదాపు 3 నిమిషాలు ఉండ‌బోతోంద‌ట‌. యుద్ధ స‌న్నివేశాలు, ఎమోష‌న్ సీన్లు, డైలాగుల‌కు ట్రైల‌ర్‌లో ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. టీజ‌ర్‌లో కేవ‌లం చిరంజీవిపైనే ఫోక‌స్ ప‌డింది. ట్రైల‌ర్‌లో మాత్రం అన్ని పాత్ర‌ల‌కూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి గొప్ప శివ భ‌క్తుడు. అందుకు సంబంధించిన షాట్ ఈ ట్రైల‌ర్‌లో ఉండ‌బోతోంది. బ్రిటీష్ వారి కోట‌, త‌మ‌న్నా నాట్యం చేసే షాట్, వార్ ఎపిసోడ్లు, ఆకాలంలో బ్రిటీష్ వాళ్ల అరాచ‌కాలు ఇవన్నీ ట్రైల‌ర్‌లో చూపించ‌బోతున్నారు. టీజ‌ర్లో చిరంజీవి ఇద్ద‌రు బ్రిటీష్ సైనికుల్ని ఒకేసారి నేల‌మీద వాల్చే షాట్ ఒక‌టుంది. అలాంటి మ‌రో షాట్‌ని ట్రైల‌ర్‌లో పెట్టార్ట‌. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగులు మ‌రోసారి బాగా పేలాయ‌ని, ట్రైల‌ర్ ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. మొత్తానికి ట్రైల‌ర్‌తో సైరా ఊపు మొద‌లైపోయిన‌ట్టే. ఈసాయింత్రం 5గంట‌ల 31 నిమిషాల‌కు సైరా ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com