‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు హసిత్ గోలీ. రాజ రాజ చోర కమర్షియల్ గా బాగా ఆడింది. స్వాగ్ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. కానీ.. విమర్శకులకు నచ్చింది. ఇప్పుడు హసిత్ మరో కథ సిద్ధం చేసుకొంటున్నారు. ఈసారి సిద్దు జొన్నలగడ్డతో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని టాక్. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈసారి కూడా పూర్తి స్థాయి వినోద భరిత కథా చిత్రాన్నే ఎంచుకొన్నారు హసిత్. ఫన్ కి పెద్ద పీట వేసినా బ్యాక్ గ్రౌండ్ కొత్తగా ఉండేలా చూసుకొన్నారు.
ప్రస్తుతం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు సిద్దు. త్రివిక్రమ్ – సిద్దు కాంబో గురించి కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండకపోవొచ్చు. ‘బ్యాడ్ యాజ్’, ‘కోహినూర్’ కథలు రెడీగా ఉన్నాయి. రెండూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే రావాలి. అవెప్పుడు పట్టాలెక్కిస్తారో తెలీదు. ‘టిల్లు క్యూబ్’ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఈ యేడాదే పట్టాలెక్కే ఛాన్స్ వుంది.
